ఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు చేయూత పథకం నాలుగో విడత చెల్లింపులు జరుపుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
కూర్మగుడా కార్పొరేటర్ మహాపారా ఇంటి బకాయి ఉండటంతో వెళ్లిన విద్యుత్ ఉద్యోగి పై ఆరుగురు దాడి చేశారు. హైదరాబాద్ పాతబస్తీ మాదన్న పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ బకాయిలు వసూళ్లు చేస్తున్న విద్యుత్ ఉద్యోగి రజినేశ్ బాబు పై కూర్మగుడా కార్పొరేటర్ మహాపారా సోదరుడు శరఫత్, ఓ అడ్వకేటతో మరో నలుగురు దాడి చేశారు. బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. టీఎస్ యుఈ ఈయు – సీఐటియూ యూనియన్ సభ్యులు పోలీసు స్టేషన్లకు…
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. సోమవారమే ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్దా పదవీకాలం త్వరలోనే ముగుస్తుంది. ఈ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్…
విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ చేర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయనుంది. అందుకు రేపు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం జరుగనుంది. రేపు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీఈఆర్టీ (SCERT) ఒప్పందం చేసుకోనుంది.
గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఓట్ల పండుగ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాయిలాలు ప్రకటించే ఛాన్సుందని సమాచారం. ముఖ్యంగా వాహనదారులకు శుభవార్త ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. తక్కువ నిధులతో ఎక్కువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధన్యతగా తీసుకోవాలన్నారు. మంగళవారం డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనల పై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో…
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మంగళవారం మరణించారు.
మాల్దీవులకు ఇండియన్స్ భారీ షాక్.. భారీగా పడిపోయిన ర్యాంక్గ.. పొరుగు అన్నాక కాస్తాంత గౌరవ.. మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. బాధ్యతగా మసులు కోవాలంటారు. అంతేకానీ కయ్యాలు పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మాల్దీవులకు దాపురించింది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు అంటే ఇదేనేమో. గతేడాది వరకు నిత్యం భారతీయ పర్యాటకులతో మాల్దీవుల పర్యాటకం కళకళలాడుతుండేది. ఇప్పుడు దేశ పెద్దలు చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది.
వైసీపీ-టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరో ఛాన్స్ ఇచ్చారు. అనర్హత పిటిషన్ల పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొ్న్నారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి అని నోటీసులో స్పష్టం చేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, పిటిషనర్ ప్రసాద్ రాజులకు నోటీసులు…
రాజస్థాన్లోని అల్వార్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కోడలు చిత్రా సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర (59) కూడా కారులో ఉండగా.. ఆయనకు గాయాలయ్యాయి.