బాపట్ల జిల్లా మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. సమాచారం తెలుసుకుని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. సెర్చింగ్ ఆర్డర్స్ లేకుండా, డిప్యూటేషన్ లేకుండా నెల్లూరు మైనింగ్ ఏడీ మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు.
భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు.
ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు…
ఉప్పల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. అందుకోసం ఇండియా-ఇంగ్లాండ్ విశాఖకు చేరుకున్నాయి. దీంతో విశాఖలో క్రికెట్ సందడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు పీఎం పాలెంలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగననుంది. అందుకోసం.. ప్రత్యేక విమానంలో ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్స్ విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. దీంతో…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. సమావేశంలో చర్చలు చాలా సహృదయపూర్వకంగా జరిగాయన్నారు. ఈ స్వల్పకాలిక సమావేశంలో ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
టీడీపీతో టచ్‌లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..! రేపో మాపో సైకిల్ ఎక్కే అవకాశం..! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట.. తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం.. ఈ మధ్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి…
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 801.67 పాయింట్లు కోల్పోయి 71,140కి పడిపోయింది. నిఫ్టీ 21550 పాయింట్లు పడిపోయి.. 215 పాయింట్లు కోల్పోయాయి. నిన్న భారీ లాభాలను మూటగట్టుకోగా.. ఈరోజు అదే స్థాయిలో పతనమయ్యాయి. కాగా.. ఉదయం గ్రీన్ మార్క్ తో ప్రారంభమైన మార్కెట్ ఎట్టకేలకు రెడ్ మార్క్ తో ముగిసింది. ఎఫ్‌ఎమ్‌సిజి, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో మార్కెట్లో గరిష్ట అమ్మకాలు కనిపించాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు…
కాంగ్రెస్ మైనార్టీలకు టికెట్ ఇచ్చింది .. కానీ ఓడిపోయామన్నారు షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి ఇవ్వలేదని, ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారన్నారు. టీఎస్పీఎస్సీలో.. మెంబర్ ఇచ్చామన్నారు షబ్బీఆర్ అలీ. హైకోర్టు జీపీ వస్తున్నారని, కాంగ్రెస్ ఏ పోస్టింగ్ ఇచ్చినా మైనార్టీ కోటా ఉంటుందన్నారు. కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏం పదవులు ఇచ్చిందని, ఆకాశం మీద ఉమ్మితే మొఖం…
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంఢీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిపోరులోనే కూటమి చతికిలపడింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికే ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. అయినా కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్‌గా విజయం సాధించారు.
బీహార్‌లో మహాఘటబంధన్ కూటమిని నితీష్ కుమార్ విడిచిపెట్టి ఎన్డీయేతో చేరిన కొద్ది రోజుల తర్వాత, నితీష్ ఇండియా కూటమిని వీడడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మౌనం వీడారు. బీహార్ కులాల సర్వే కారణంగానే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నిష్క్రమించారని రాహుల్ గాంధీ అన్నారు.