హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ‘కుమారి ఆంటీ’కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించ్చుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీతో స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఇది కలన లేక నిజమా అన్నటుందన్నారు. మళ్లీ హోటల్ పెడతామని అసలు అనుకోలేదని, కానీ ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ మా ఇంటి శ్రీరాముడు అంటూ ఆమె కొనియాడారు. మళ్ళీ రామరాజ్యం వచ్చిందన్నారు. నిన్న హోటల్ ని తీసేయాలంటూ పోలీసులు వచ్చారు. కేసు ఫైల్ చేసారు. హోటల్ వ్యాన్ ను తీసుకెళ్లారన్నారు. 24 గంటలు తిరక్క ముందే నా విషయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హోటల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ ఇక్కడి నుండి హోటల్ తొలగించాలని అధికారులు చెప్పారని, దీంతో చాలా బాధ పడ్డాను నిన్నటి నుండి ఏడుస్తునే ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు.
కానీ సీఎం ఆదేశాలతో మా ఫ్యామిలీ బ్రతికినట్లు అయిందన్నారు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి సీఎం రేవంత్ స్పందించడం చాలా గొప్ప విషయమన్నారు. సిఎం మా హోటల్ కి వచ్చి ఫుడ్ రుచి చూస్తా అనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. సీఎం కోసం ఇంకా మంచి రుచికరమైన భోజనం వంది పెడతాననని, మా హోటల్ ని యధా స్థితిలో కొనసాగించేలా అధికారులకి ఆదేశాలు ఇచ్చిన సీఎం మా దేవుడు అని ఆమె అన్నారు. గత 11 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నానని, ఈమధ్య సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో విపరీతంగా రద్దీ పెరిగిందన్నారు. రోజు 400 నుండి 500 మందికి వంట చేసి ఫుడ్ అమ్ముతామని, నాన్ వెజ్ లో చాలా వెరైటీలు చేసి కస్టమర్స్ కి అందిస్తామన్నారు. మాలాంటి స్ట్రీట్ వెండర్స్ కి వ్యాపారం ఓ చోట నిర్వహించు కోవడానికి ప్రభుత్వం ఏదైనా దారి చూపితే బాగుంటుందన్నారు.