కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పలువురు తమ ప్రతిభను చూపించారు. ఒకే ముగ్గులో మొత్తం సంక్రాంతి అంతా చూపించడం అబ్బురపరిచింది. ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేసారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు.. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చారు.
దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం థియేటర్లో విజిట్ కి వెళ్ళినప్పుడు సౌండ్ కి భలే ఎక్సైటింగ్ అనిపించిందని సినిమా చూసిన అందరూ విజువల్స్ గురించి కూడా మాట్లాడడం ఆనందం కలిగిస్తోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అధారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారాలను బదలాయింపు చేసింది ప్రభుత్వం.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సంఘటన దురదృష్టకరమైన.. దైవ సన్నిధిలో ప్రాణాలను కోల్పోవడం అదృష్టమన్నారు నెహ్రూ. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెల్లించే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నిర్వాహకులు.. ఒకపక్క పోలీసుల అంచులు కొనసాగుతున్న నిర్వాహకులు పందెంబరులను అందంగా ముస్తాబు చేసే పనిలో పడ్డారు.
అలాంటి సీన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశా: వెంకటేష్ ఇంటర్వ్యూ విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి…
విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముత్యాల ముగ్గులతో తమలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు మహిళా పోలీసు సిబ్బంది. భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు.
తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం రేపుతుంది. టీటీడీ ఉద్యోగిపై దాడికి పాల్పడింది. సైన్స్ సెంటర్ వద్ద టీటీడీ ఉద్యోగి ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. అంతేకాదు.. దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు…
కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి.