2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌పై అతని ఇన్నింగ్స్ ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్.. నాయర్ తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత నాయర్‌కు ఎక్కువ అవకాశాలు లభించలేదు.. అంతేకాకుండా జట్టులో కూడా ఉండలేకపోయాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ పట్టు వదలని విక్రమార్కుడిలా.. ఇప్పుడు మరోసారి సెలక్టర్ల రాడార్‌లో నిలిచాడు.
Read Also: Mahakumbh 2025 : ‘భారత్ చాలా గొప్పది’.. సనాతన ధర్మాన్ని కొనియాడిన విదేశీ భక్తులు (వీడియోలు)
కరుణ్ నాయర్ 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. అప్పటి నుంచి నాయర్ జట్టులోకి పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. నాయర్ భారత్ తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 374 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై అజేయంగా 303 పరుగులు చేశాడు.
Read Also: IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌లు బదిలీలు.. ఉత్తర్వులు జారీ
ఓ వార్తాపత్రిక నివేదిక ప్రకారం.. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భకు ఆడుతున్నప్పుడు నాయర్ యొక్క ప్రదర్శనపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో.. టెస్టు జట్టులోకి తిరిగి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టెస్టు జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానంపై సంక్షోభం నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో జట్టులో వారి స్థానాన్ని నాయర్ భర్తీ చేసే అవకాశం ఉంది. నాయర్‌కు దేశవాళీ క్రికెట్‌లో అనుభవం ఉంది.. అతని అనుభవంతో సీనియర్ ఆటగాడిలా ఆడగలడు. ఈ క్రమంలో.. నాయర్ టీమిండియాకు తిరిగి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. నాయర్ మొదట కర్ణాటక జట్టుకు ఆడేవాడు.. ఇప్పుడు విదర్భ జట్టుకు ఆడుతున్నాడు.