తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి (మం) కళ్యాణి డ్యామ్ దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు.. మదనపల్లి బస్సు డ్రైవర్ బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తిరుపతి నుంచి పీలేరుకు వెళుతున్న బస్సు, మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం జరగడంతో.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. క్షతగ్రాతులను రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.