ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిన్న కేటీఆర్‌ను ఏసీబీ 7 గంటలు విచారించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఏసీబీ విచారణకు సంబంధించి విషయాలను కేటీఆర్ కేసీఆర్‌కు వివరించారు.
ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆదివాసీ సమస్యలను ఆదివాసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అంజిరెడ్డిని నియమించింది.
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షావోమీ మార్కెట్ లో తన సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను రూపొందిస్తూ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. దీంతో షావోమీ ఉత్పత్తులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు మరో కొత్త ప్యాడ్ ను లాంఛ్ చేసింది. మతిపోగొట్టే ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 ను నేడు దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.
సంక్రాంతి పండగ కోసం ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని అన్నారు. మరోవైపు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
కేటీఆర్, బండి సంజయ్‌లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాను ఏ విధంగా గౌరవించాలో కేటీఆర్ నేర్చుకోవాలని అన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇన్వెస్ట్గేట్ ఏజెన్సీని అవమానిస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి (మం) బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం హరిత రిసార్ట్‌కు వచ్చిన ప్రేమజంట.. ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు. అయితే.. రాత్రి పూట ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదు కానీ, ఉదయం రూమ్ క్లినింగ్కి సిబ్బంది వెళ్ళగా ప్రేమికులు ఉరివేసుకుని కనిపించారు.
గోషామహల్లో చాక్నావాడి నాళా మరోసారి కుంగింది. కుంగిన సమయం అర్ధరాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. దారుసల్లాం నుండి చాక్నావాడి వెళ్లే దారి మధ్యలో సివరేజి నాళా కుంగిపోయింది. ఇప్పటికే గతంలో రెండు సార్లు ఈ నాళా కుంగింది. గతంలో కుంగిన నాళా నిర్మాణ పనులకు కోసమని రీడిమిక్స్ లారీ అక్కడకు వచ్చింది.
కేటీఆర్ విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తోందని ఆరోపించారు. లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు.