Sai Pallavi : 7 ఫిలింఫేర్లతో.. సాయి పల్లవి అరుదైన రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేసే అతికొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. మేకప్ లేకుండా వెండితెరపై మెరిసే ఈ సహజ నటి, తాజాగా తన ఖాతాలో మరో అరుదైన మైలురాయిని చేర్చుకుంది. తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో ‘అమరన్’ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో, ఆమె కెరీర్‌లో మొత్తం 7 ఫిలింఫేర్ అవార్డులు చేరాయి.
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో మొదలైన ఆమె ప్రస్థానం, నేడు భారతీయ సినిమాలోనే అత్యుత్తమ నటిగా (GOAT Actress) కీర్తించబడే స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఆమె అందుకున్న ఫిలింఫేర్ అవార్డుల జాబితా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
1. ప్రేమమ్: బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ (మలయాళం)
2. ఫిదా: ఉత్తమ నటి (తెలుగు)
3. శ్యామ్ సింగరాయ్: ఉత్తమ నటి (తెలుగు)
4. లవ్ స్టోరీ: ఉత్తమ నటి (తెలుగు)
5. గార్గి: ఉత్తమ నటి (తమిళం)
6. విరాటపర్వం: ఉత్తమ నటి – క్రిటిక్స్ (తెలుగు)
7. అమరన్: ఉత్తమ నటి (తమిళం – లేటెస్ట్)
ఒకే నటి వేర్వేరు భాషల్లో, విభిన్నమైన పాత్రలతో ఇన్ని అవార్డులు అందుకోవడం ఒక రికార్డు అనే చెప్పాలి. ముఖ్యంగా గతేడాది విడుదలైన ‘అమరన్’లో ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో ఆమె పండించిన భావోద్వేగాలకు ఫిలింఫేర్ జ్యూరీ ఫిదా అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో హిందీలో ‘రామాయణ’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ వేగంతో వెళ్తే భవిష్యత్తులో ఆమె మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయం.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!