T20 World Cup 2026: సూపర్ 8 ఆడకుండానే సెమీస్‌లోకి భారత్.. ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: ICC T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 రౌండ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జింబాబ్వేలతో కలిసి గ్రూప్ 1లో ఉంది. టీమిండియా ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఈ సూపర్ 8లో, గ్రూప్ దశ నుంచి ఎటువంటి క్యారీఓవర్ పాయింట్లు ఉండవు. అన్ని జట్లు సున్నా నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ సూపర్ 8లో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది, మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఏదైనా గ్రూప్‌లోని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయితే, ఆ రెండు జట్లకు ఒకొక్క పాయింట్ లభిస్తుంది. ఈ స్టోరీలో బ్యాట్ పట్టకుండానే భారత్ సెమీస్‌లోకి ఎలా ప్రవేశిస్తుందో తెలుసుకుందాం.
READ ALSO: Gautam Gambhir: “అరే యార్.. మీరు ఎలా మేనేజ్ చేస్తారు?”.. అభిమానులతో గంభీర్ ఫన్నీ చిట్‌చాట్ వైరల్
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఇటీవల మొదటి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ – న్యూజిలాండ్ జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఏదైనా సూపర్ 8 గ్రూప్‌లోని అన్ని మ్యాచ్‌లు వర్షం వల్ల లేదంటే మరేదైనా కారణం వల్ల రద్దు అయితే ఏమి జరుగుతుందనేది. ఈ మెగా టోర్నమెంట్‌లో అలాంటి పరిస్థితులు ఎదురైతే సూపర్ 8 రౌండ్ తర్వాత అర్హత కోసం ICC వివిధ ప్రమాణాలను నిర్దేశించింది, వాటితో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సెమీ-ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే..
ఐసిసి నిబంధనల ప్రకారం.. పాయింట్ల పట్టిక ఆధారంగా సెమీ-ఫైనల్ బెర్త్‌లను నిర్ణయిస్తారు. మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఆ రెండు జట్టుల పాయింట్లు సమమైతే, సూపర్ 8 రౌండ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ముందుకు వెళ్తుంది. అయితే, మ్యాచ్‌ల సంఖ్య కూడా సమానం అయితే, నిర్ణయం నెట్ రన్ రేట్ ఆధారంగా ఉంటుంది. నెట్ రన్ రేట్ కూడా సమమైతే, రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించి విజేతగా నిలిచిన జట్టు సెమీ ఫైనల్ బెర్త్‌కు అర్హత సాధిస్తుంది. కానీ మ్యాచ్‌లు జరగకపోతే అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సమాధానం ఏమిటంటే.. గ్రూప్ 1 మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా రద్దయితే, నాలుగు జట్లు చెరో 3 పాయింట్లతో టై అవుతాయి. అప్పుడు ఆ జట్టుల విజయాల సంఖ్య సున్నా అవుతుంది. దీంతో నెక్ట్స్ ఆప్షన్‌గా నెట్ రన్ రేట్‌కు వెళ్తారు. కానీ అసలు మ్యాచ్‌లు జరగకపోవడంతో, NRR కూడా సున్నా అవుతుంది. మ్యాచ్‌లు జరగకపోవడంతో హెడ్-టు-హెడ్ మ్యాచ్‌లు కూడా సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో, చివరి టై-బ్రేకర్ ICC T20I ర్యాంకింగ్స్ అవుతుంది. T20I ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. దీంతో ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సెమీఫైనల్‌కు చేరుకోగలదని చెబుతున్నారు.
READ ALSO: PM Modi: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉంది, చొక్కాలు విప్పడం దేనికి..
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!