హైదరాబాద్లో ఘనంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్..
సంక్రాంతి పండగా సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కైట్ ఫెస్టివల్ లో 19 దేశాల నుంచి 47మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. మన దేశంలో 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్ లో పాల్గొననున్న 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. ఇక, నోరూరించే పిండి వంటలతో స్వీట్ ఫెస్టివల్ సైతం నిర్వహించనున్నారు. దేశ, విదేశాల పిండి వంటలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో మొత్తం 11 వందల పిండి వంటలు ఉండనున్నాయి.
టీటీడీలో ఎలాంటి సమన్వయ లోపం లేదు.. అది దురదృష్టకరం
తిరుపతి ఘటన తర్వాత సోషల్ మీడియాలో టీటీడీపై రకరకాల పోస్టులు పెడుతున్నారు.. అయితే, సోషల్ మీడియాలో టీటీడీపై తప్పువు వార్తలు ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఈవో శ్యామలరావుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. దర్శన టిక్కెట్లు తిరుపతిలోనే జారి చేస్తామని స్పష్టం చేశారు.. అయితే, మార్పులు చేయాల్సి వస్తే వచ్చే ఏడాదికి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. తొక్కిసలాట ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారణ వ్యక్తం చేశారు.. ఆ ఒక్క ఘటన మినహా మిగిలినవి అన్ని బాగా జరిగాయని తెలిపారు.
చైనాలో తగ్గుముఖం పట్టిన HMPV వైరస్ కేసులు.. భారత్ పరిస్థితి ఏంటంటే ?
కఠినమైన నిఘా ఉన్నప్పటికీ భారతదేశంలో కొత్త HMPV కేసులు నిరంతరం ఎక్కడో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వారంలో గుజరాత్, అస్సాం, పుదుచ్చేరిలలో కొత్త HMPV కేసులు నమోదయ్యాయి. HMPV గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, చైనా నుండి ఒక శుభవార్త వచ్చింది. చైనాలో HMPV వైరస్ కేసులు తగ్గడం ప్రారంభించాయి. కానీ భారతదేశం ఇంకా ఊపిరి పీల్చుకునే సమయం కాలేదు.
“హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కొత్త వైరస్ కాదు, కనీసం రెండు దశాబ్దాలుగా ఇది మనతో ఉంది” అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ విలేకరుల సమావేశంలో పరిశోధకుడు వాంగ్ లిపింగ్ అన్నారు. 2001లో నెదర్లాండ్స్‌లో తొలిసారిగా గుర్తించబడిన ఈ వైరస్ కేసుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో పెరిగిందని వాంగ్ చెప్పారు. ఇప్పుడు HMPV కేసుల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతోందని, ఉత్తర ప్రావిన్సులలో పాజిటివ్ కేసుల రేటు తగ్గుతోందని ఆయన అన్నారు.
పల్లె సౌభాగ్యమే.. దేశ సౌభాగ్యం.. భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పండగ సందడిలో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని పేర్కొన్న ఆయన.. భారతీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.. పల్లె సౌభాగ్యమే… దేశ సౌభాగ్యం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.
ఏపీలో వారికి మరో రోజు సెలవు.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మరో రోజు సెలవుగా ప్రకటించింది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో 73 జారీ చేశారు. అయితే, కనుమ రోజు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి చేయగా.. దీంతో, కనుమ రోజు అంటే జనవరి 15వ తేదీన ప్రభుత్వ సెలవుగా ఖరారు చేశారు.. కాగా, డిసెంబర్‌లో జారీ చేసిన 2025 ప్రభుత్వ సెలవుల్లో ఏపీలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14వ తేదీన మాత్రమే సెలవుగా ప్రకటించారు. దాని ప్రకారం కనుమ రోజు బ్యాంకులు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది.. దీనిపై యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనిట్ 15వ తేదీన కూడా సెలవుగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో.. డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణలు చేస్తూ ఈ రోజు జీవో నంబర్ 73 విడుదల చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్..
ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు.. వీడియో వదిలిన త్రినాధ రావు!
మహిళలందరికీ దర్శకుడు త్రినాథరావు నక్కిన క్షమాపణలు తెలిపారు. నిన్న హైదరాబాద్ ఆవాస్ హోటల్ లో జరిగిన మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో త్రినాధరావు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మన్మధుడు హీరోయిన్ అన్షు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫారిన్ లో సెటిల్ అయిన ఆమె తిరిగి ఇండియా వచ్చాక ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యామని చెప్పారు. అయితే ఆమె సన్నగా ఉండడంతో కొంచెం తిని లావు అవమని చెప్పానని, ఎందుకంటే తెలుగు వారికి కొంచెం సైజులు పెద్దగా ఉంటేనే ఇష్టపడతారని అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తెలంగాణ మహిళా కమిషన్ ఏకంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. తాజాగా ఈ అంశం మీద దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. నిన్న జరిగిన మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులు నొప్పించిందని విషయం అర్థమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
నిన్న జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్ లో ఫెయిల్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం పెట్టి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, గతంలో జిల్లా పరిషత్ లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంచార్జీ మంత్రి కంట్రోల్ చేసేవారన్నారు. నిన్న జరిగిన ఘటనలో ముగ్గురు మంత్రులు ఉండి జరిగిన ఘటనను కంట్రోల్ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు.
పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు..!
బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న నాయకుడిగా నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన వాగ్వాదాలు, వారిపై సవాళ్లు విసిరి ప్రాచుర్యంలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో జరిగిన అధికారిక కార్యక్రమంలో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఈ వివాదం చర్చనీయాంశంగా ఉండగానే, కౌశిక్ రెడ్డి మరో సమస్యలో చిక్కుకున్నారు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై మరో ఫిర్యాదు చేసారు.
బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత్ సమన్లు..
రెండు దేశాల మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతపై భారత ప్రభుత్వం సోమవారం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్‌ను పిలిపించింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిచిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులోని ఐదు చోట్ల ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఢాకా ఆరోపించడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. చపైనవాబ్‌గంజ్, నౌగావ్, లాల్మోనిర్హాట్, తీన్ బిఘా కారిడార్‌తో సహా ఐదు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబాటు యత్నాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటన్నింటి మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్‌కు భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.
ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారికి ప్రతి నెలా రూ. 20 వేల పింఛను?
ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారికి ప్రతినెలా రూ.20వేలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఒడిశా బీజేపీ ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ చేతిలో చిత్రహింసలకు గురైన ఒడిశా ప్రజలకు ప్రభుత్వం వైద్య ఖర్చులతో పాటు పింఛను అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
అంతకుముందు జనవరి 2న ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ అంతర్గత భద్రతా చట్టం, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ లేదా డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కింద ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలుకెళ్లిన వారికి నెలవారీ పెన్షన్‌ను అందజేస్తామని ప్రకటించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లిన వారందరికీ పెన్షన్‌తోపాటు వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. 2025 జనవరి 1 వరకు జీవించి ఉన్న వారందరికీ పింఛను, వైద్య సదుపాయాలు అందజేస్తామని చెప్పారు.