ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు.
Mahakumbh 2025 : మహా కుంభమేళ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి చిహ్నం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశ పౌరాణిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకునే వేడుక కూడా. గంగా, యమునా సరస్వతి అనే మూడు నదులు కలిసే దివ్య సంగమం ప్రయాగ్‌రాజ్.
చిత్తూరు జిల్లాలో పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి కరిష్మా (27) పరిస్థితి విషమంగా ఉంది.
తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే ఇంటి యాజమాని ఇంటిలో ప్రారంభించారు. అంతేకాకుండా.. సీఎం చంద్రబాబు స్వయంగా టీ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదేనన్నారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఓ గుడ్ న్యూస్‌ను బీసీసీఐ చెప్పింది. ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా ప్రకటించింది. మార్చి 21వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 23 నుంచి మే 25 వరకు ఐపీఎల్-2025 జరుగుందని తెలిపారు. మొదటి మ్యాచ్‌లో చెన్నై…
విశాఖలో సంక్రాంతి సందడి మొదలైంది. సాంప్రదాయ దుస్తుల్లో యువతీ యువకులు ఎంజాయ్ చేస్తున్నారు. డు..డు.. బసవన్నలు, గంగిరెద్దుల హడావిడి మొదలైంది. తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో పెద్ద పండుగ సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి.
ఒకే వేదికపై ప్రధాన పార్టీల నాయకులు.. మీ ఐఖ్యతకు సలాం! తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఘటన అందరినీ ఆకట్టుకుంది. భాగ్యనగరంలో బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండిసంజయ్‌కుమార్,…
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదు... అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత రాయచోటికి వచ్చాడని ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్) విధానంపై దృష్టి పెట్టాలని తెలిపారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.