ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ టీమిండియా స్టార్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను తన దృష్టిని మరల్చాల్సిన అవసరం ఉందని అన్నాడు. ప్యూచర్ ఆఫ్ ఇండియాగా భావించే శుభ్‌మన్ గిల్ తన జుట్టుపై కాకుండా బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాడు. గిల్ ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అతని ప్రదర్శన నిరాశపరిచింది. గిల్ మూడు మ్యాచ్‌ల్లో 93 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మూడు, నాలుగో మ్యాచ్‌ల్లో గిల్‌కు జట్టులో స్థానం లభించలేదు.
Read Also: Sankranthi Celebrations: కోనసీమను మించేలా పులివెందులలో మొదటిసారి కోడి పందాలు..
గిల్‌క్రిస్ట్ పాడ్‌కాస్ట్‌లో గిల్ రేటింగ్.. అతని బ్యాటింగ్ గురించి మాట్లాడాడు. “నేను అతనికి 10కి మూడు మార్కులు వేయాలనుకున్నాను, కానీ నాలుగు మార్కులు వేస్తాను. హెల్మెట్ తీసిన తర్వాత క్రికెటర్ జుట్టు చిందరవందర అవుతుంది. గిల్ తన జుట్టు కంటే బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి” అని గిల్‌క్రిస్ట్ చెప్పాడు. శుభ్‌మన్ గిల్‌పై గిల్‌క్రిస్ట్ మాత్రమే కాదు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా అసంతృప్తిగా ఉన్నాడు. వాన్ గిల్‌కు 10కి నాలుగు మార్కులు ఇచ్చాడు. వాన్ మాట్లాడుతూ, “నేను అతనికి 10కి నాలుగు ఇస్తాను. అతను పెద్ద స్కోరు చేయాలి. గిల్ గొప్ప బ్యాట్స్‌మెన్.. అతని బ్యాటింగ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది.” అని అన్నాడు. గిల్ డిసెంబర్-2022లో బంగ్లాదేశ్‌పై సెంచరీ సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో గిల్ ఇన్నింగ్స్ 110 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ నుంచి గిల్ టెస్టుల్లో సెంచరీ చేయలేదు.
Read Also: Harihara Veeramallu: వీరమల్లు మాట చెప్తే వినాలి.. పవన్ పాడిన పాట వచ్చేస్తోంది!