రోజా అన్నీ గాలి మాటలు మాట్లాడుతుంది.. మంత్రి విమర్శనాస్త్రాలు మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదని పార్టీలో అందరూ మారుతున్నారని తెలిపారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులు అందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు.. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ పునరుద్ధరించాం.. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు…
తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈనెల 26 నుంచి రేషన్ కార్డుల మంజూరుకు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అర్హత ప్రమాణాల పరిశీలనకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి (మం) కళ్యాణి డ్యామ్ దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు.. మదనపల్లి బస్సు డ్రైవర్ బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.
హైదరాబాద్‌లో ఘనంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. సంక్రాంతి పండగా సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కైట్ ఫెస్టివల్ లో 19 దేశాల నుంచి 47మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. మన దేశంలో 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్ లో పాల్గొననున్న 54 మంది నేషనల్ ప్రొఫెషనల్…
2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌పై అతని ఇన్నింగ్స్ ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్.. నాయర్ తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత నాయర్‌కు ఎక్కువ అవకాశాలు లభించలేదు.
ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. చింతపల్లి ఏఎస్పీగా 2021 బ్యాచ్‌కు చెందిన నవ జ్యోతి మిశ్రాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే.. నంద్యాల ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన మందా జావళి అల్ఫోన్ను నియమించారు.
మూడు రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న సంక్రాంతి పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. ఒక కిలోమీటరు డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా , జంగారెడ్డిగూడెం జట్లు ఫైనల్లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవ పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో సంక్రాంతి సంబరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించారు. అనంతరం.. భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.
సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారన్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కాంగ్రెస్ అని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు.