మహామృత్యుంజయ్ మంత్రాన్ని పఠించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది. మహాశివరాత్రి నాడు, మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుడిని కూడా పూజించవచ్చు. మహామృత్యుంజయ మంత్రం మూల కథ శివునితో ముడిపడి ఉంది. రండి, మహామృత్యుంజయ మంత్రం కథ, దానిని జపించవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే, కొత్త ప్లేయర్స్ తో బలంగా ఉంది. ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. మరోవైపు.. ఈరోజు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది.
తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన చిన్ననాటి స్నేహితురాలు కలలోకి వచ్చి తన దగ్గరికి రమ్మంటుందని మృతురాలు తన సోదరుడికి చెప్పి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 సంవత్సరాల క్రితం మరణించిన స్నేహితుడు కలలోకి వస్తున్నాడని భయపడుకుంటూ చెప్పి.. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్షాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 24.05 కోట్ల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) యొక్క పల్లె వెలుగు, ఎక్సప్రెస్, నాన్-లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు మహాలక్ష్మి జీరో టికెట్ పథకం అనుమతిస్తున్న విషయం విదితమే. ప్రభుత్వ ఉద్యోగులతో సహా శ్రామిక, గ్రామీణ మహిళలకు ఈ పథకం వరంగా మారింది, ఎందుకంటే, ప్రయాణానికి వెళ్లడానికి ఖర్చు చేసిన…
బీజేపీ మంత్రిని పట్టపగలు కాల్చిచంపిన దుండగులు.. ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బోధాపూర్‌లో నివాసముంటున్న మంత్రి ప్రమోద్‌కుమార్ యాదవ్ రోజూ ఉదయం జిల్లా కేంద్రానికి పని నిమిత్తం వస్తుంటారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) బ్రిజేష్ కుమార్ తెలిపారు.…
లోక్‌సభ ఎన్నికల్లో దున్నేస్తాం…. దుమ్ము దులిపేస్తాం…. తెలంగాణలో డబుల్ డిజిట్ కొట్టేస్తామని సవాళ్ళు చేస్తున్న కాషాయ దళానికి ఆ జిల్లాలో నడిపే నాయకుడు లేడట. ప్రతి సీటు ముఖ్యమని భావిస్తున్న టైంలో రెండు నియోజకవర్గాలున్న జిల్లాను పార్టీ నాయకత్వం ఎందుకు లైట్ తీసుకుంది? మాకో నాయకుడు కావాలి మొర్రో….. అని కేడర్ మొత్తుకుంటున్నా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏదా జిల్లా? ఏవా రెండు నియోజకవర్గాలు? లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి టార్గెట్ 400 అంటోంది…
ఢిల్లీలో కోల్, పవర్ కేంద్ర మంత్రులను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఇద్దరు కేంద్ర మంత్రులను కలిశామన్నారు. కోల్ మినిస్ట్రీ, సింగరేణికి కావాల్సిన కోల్డ్ బ్లాక్స్ గురించి సింగరేణి సమస్యల గురించి సింగరేణి అవసరాల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సింగరేణి తాడిచెర్ల సెకండ్ బ్లాక్ ఎన్నో ఎళ్లుగా పెండింగ్‌లో ఉందని, 2013లో ఆలస్యం చేసారని, తాడిచర్ల టు బ్లాకు…
తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. మార్చి 18 నుండి ఏప్రిల్ రెండు వరకు 10 వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యా్హ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ భాష (కాంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉంటుంది.…
ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సురేష్ శర్మ నగర్లో పదేళ్ల క్రితం జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో జడ్జి కీలక తీర్పు ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ తల్లి, సోదరుడు, కోడలును హత్య చేసిన ఛాయ్మార్ గ్యాంగ్‌లోని ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది దుర్మార్గులకు మరణశిక్ష విధించారు. అంతేకాకుండా.. దుండగులు దోచుకున్న బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన బంగారం వ్యాపారి…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ గతంలో ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా సింహ గర్జన సభ వేదిక అయిందని, ప్రస్తుతం అబద్ధాల రేవంత్ కి వ్యతిరేకంగా కదనభేరి నిర్వహిస్తున్నామన్నారు. జేబులో కత్తెర్లు పెట్టుకుని తిరుగుతున్న అని జేబుదొంగ లాగా మాట్లాడుతున్నాడు రేవంత్ అని, మానవ బాంబులు అవుతాం అని రేవంత్ అంటున్నారు.. మీ ప్రభుత్వాన్ని కూల్చే బాంబులు ఖమ్మం బాంబు, నల్గొండ బాంబు…