Crime News: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఓ మైనర్ బాలికపై, 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఇదే పట్టణానికి చెందిన షేక్ సుబాని(45) అత్యాచారం చేసి పరారైనట్లు ఆయన తెలిపారు. బాధితురాలి తల్లి వరంగల్ జిల్లా చెందిన ఓ వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. రెండేళ్లకి కుమార్తె పుట్టింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం కూతుర్ని తీసుకొని బతుకుదెరువు కోసం కోదాడకు వచ్చింది. కోదాడలో నివాసం ఉంటున్న ఆమెకు నేరేడుచర్ల మండలంలోని గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవర్ పరిచయమయ్యాడు. అతన్ని వివాహం చేసుకుని నేరేడుచర్లకు వచ్చింది. గత ఏడాది కాలంగా నేరేడుచర్లలో అద్దె ఇంట్లో ఈమె కూతురు, భర్తతో కలిసి ఉంటుంది.
Read Also: Road Accident : కారు – ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
వీరి పక్క ఇంట్లోనే షేక్ సుబాని నివాసం ఉంటున్నాడు. సుబాని భార్యతో విభేదించి గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. నేరేడుచర్లలో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. బాధితురాలు, షేక్ సుబానీలు ఇరువురు కుటుంబాలు ఒకే ఇంట్లో పక్కపక్క రూములలో అద్దెకు ఉంటున్నారు. షేక్ సుబాని, సహజీవనం చేస్తున్న మహిళ మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరగడంతో ఆమె రాత్రి బాధితురాలి ఇంట్లో పడుకుంది. సుబాని మాత్రం అద్దె ఇంట్లోనే ఉన్నాడు. సుబానితో సహజీవనం చేస్తున్న మహిళకు ఇదే వీధిలో సొంత ఇల్లు ఉంది. బాధితురాలి తల్లితో కలిసి ఆమె శనివారం ఆ ఇంటి వద్దకు వెళ్లింది. బాధితురాలు కూడా వారితో అక్కడే ఉంది. తల్లి ఇంటికి వెళ్లి అన్నం పెట్టుకు రమ్మని చెప్పడంతో, బాధితురాలు వారు ఉంటున్న అద్దె ఇంటికి వచ్చింది. సుబాని అది గమనించాడు. ఒంటరిగా వుండడంతో సుబాని బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెను బలవంతంగా అత్యాచారం చేసి గోడదూకి పారిపోయాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటనా ప్రాంతాన్ని హుజూర్‌నగర్ సీఐ చలమంద రాజు పరిశీలించారు. నిందితుడిని పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.