Jagadish Reddy : కాంగ్రెస్ మార్పు మాత్రం తిరోగమనంలా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల అవుతోందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మూడు నెలల అనేది తక్కువ కాలం కాదన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెప్పితే…. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారన్నారు. మార్పు మాత్రం తీరోగమనంలా ఉన్నదని, బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలు ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్ళు లేక ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారని, కేసీఆర్ మీదా నమ్మకంతో అత్యధికంగా యాసంగి పంట వేశారని జగదీష్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా..’ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిందీ కరువు వచ్చింది…. నాగార్జున సాగర్ లో 510 అడుగుల నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్ళు ఇచ్చాం. ఇవ్వాళ నాగార్జున సాగర్ లో నీళ్ళు ఉన్నా…. రైతులకు నీళ్ళు ఇవ్వడం చేత కావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో నీళ్ళు ఉన్నా…. ప్రభుత్వం కాంగ్రెసే ఉన్నా అడగడం చేత కావడం లేదు. మానవ బాంబులు అయితాం…. పేగులు మెడలో వేసుకుటాం… ఏం భాష రేవంత్ రెడ్డి మాట్లాడేది. ఇవ్వాళ రైతుల పేగులు నీ మెడలో వేసుకునే పరిస్థితీ వచ్చిందీ. ఇవ్వాళ వ్యవసాయ రంగం మీదా సమీక్ష లేదు… పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇవ్వాళ కాళేశ్వరంలో 400 క్యూసెక్కుల నీళ్ళు వృధాగా పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంకి కరువు కనపడడం లేదు….
Also Read
బీఆర్ఎస్ శంఖుస్థాపనలు చేసిన పనులు మొదలు పెట్టుకుంటు…. 90 రోజుల్లో అది చేశాం, ఇది చేశామనీ గొప్పలు చెప్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కొట్టుకొని పోవాలని చూస్తున్నారు…. బిఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటనే నీటి పారుదల పైన సమీక్ష చేయాలి…. రైతాంగానికి ఏం బరోసా ఇస్తారో చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాని….. కరువు పర్యటన చెయ్యాలి. గుత్తా అమిత్ రెడ్డినీ ఎవరు అడ్డుకోవడం లేదు…. ఆయనే ప్రకటన చేసుకున్నాడు …… ఆయనే అడ్డుకుంటున్నారని చెప్తున్నారు….. రెండు రోజుల్లో నల్లగొండ , భువనగిరి అభ్యర్ధుల ప్రకటన ఉంటుంది.’ అని జగదీష్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!