ఆ సినిమాలో అన్నీ బూతులే.. కానీ, డబ్బులు బాగా వచ్చాయి
తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. మార్చి 15న లైన్ మ్యాన్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శివ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్ లాంచ్ చేశారు.
అనంతరం ఈ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ” తినే ప్రతీ మెతుకు మీద పేరు రాసి ఉంటుందని అంటారు.. ప్రతీ పాత్ర మీద కూడా చేసే వాడి పేరు రాసి ఉంటుంది. మన స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో చిన్న ఉడతలా సాయం చేస్తున్నాను. లేడీస్ లైన్ ఉమెన్‌గా రావడం చూసి.. ఈ సినిమాను చేయాలని అనుకున్నా. కథ సరిగ్గా ఆడలేదు.. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో అన్నీ బూతులే. డబ్బులు బాగా వచ్చాయి. కారు, ఇళ్లు కొనుక్కుని సెటిట్ అయ్యా. కానీ లైన్ మెన్ లాంటి సినిమాలు తీసినప్పుడు రాత్రి పూట ప్రశాంతంగా పడుకుంటాం. ఇప్పుడు సినిమాలకు భాషా సరిహద్దుల్లేవు. లైన్ మెన్‌లు చేస్తున్న సేవలను ఎవ్వరూ గుర్తించడం లేదు. ఆ సినిమాలో అన్నీ బూతులే.. కానీ, డబ్బులు బాగా వచ్చాయి.
సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం..
మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తోంది.. సభకు వచ్చిన ప్రజల్ని చూస్తుంటే మహాసముద్రాన్ని తలపిస్తోందని అన్నారు. నాపై నమ్మకంతో వచ్చిన అందరికీ ధన్యవాదాలు.. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దామని తెలిపారు. పేదవాడి భవిష్యత్ ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అన్నారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు.. ప్రజలే బలంగా మనం తలబడుతున్నామని చెప్పారు. పేదలను గెలిపించడమే తన లక్ష్యమన్నారు. జగన్ ను ఓడించాలని వాళ్లు చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు ధర్మం.. అధర్మం మధ్య జరిగే యుద్ధం అని సీఎం జగన్ తెలిపారు.
త్వరలోనే మేనిఫేస్టో విడుదల.. చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం
మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలోనే మేనిఫేస్టో విడుదల చేస్తామని తెలిపారు. మేం చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం అన్నారు. చంద్రబాబు మేనిఫేస్టోకు.. శకుని చేతిలో పాచికలకు తేడా ఉందా..? అని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పే అబద్దాలకు హద్దే లేదని విమర్శించారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు.. అధికారం పోతుందన్న భయంలేదు.. హిస్టరీ బుక్ లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే తన కోరిక అని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాక, కరోనా లాంటి కష్టాలు వచ్చినా.. తగ్గేది లేదని ముందుకు వెళ్లామని తెలిపారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలుచేశామని పేర్కొన్నారు.
మూడు పార్టీలు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.. 2014లో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలు చేశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు.. మళ్లీ పొత్తుల డ్రామాతో చంద్రబాబు ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. DTS పద్ధతిలో ఏడాదికి రూ.75 వేల కోట్లు ఇచ్చాం.. మన సంక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వాదించారన్నారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలని సీఎం తెలిపారు. మనం అమలు చేస్తున్న 8 పథకాలను ఎవరూ టచ్ చేయలేరు.. ఎవరైనా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు.
ఈటల రాజేందర్ అనేటోడు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ స్పందించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని మల్కాజిగిరికి ఈటల రాజేందర్ కు సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు. ఈటల రాజేందర్ అనేటోడు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టిబిడ్డగా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డను అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరి మీద పడితే వారి మీద, ఏది పడితే అదే… చప్పట్లు కొట్టగానే రెచ్చిపోయి మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. కానీ ముందుంది ముసళ్ళ పండగ అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ రాష్ట్రంలో తొలి ఆర్థికమంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నాం. ఈనాడు ఈ రాష్ట్ర ఆర్థికస్థితి ఏముందో, ఏం కాగలదో చెప్పగలిగే సత్తా నాకుంది.
చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు..
మేదరమెట్ల సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు అని దుయ్యబట్టారు. చంద్రబాబు.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటైన అమలు పరిచారా ? అని ప్రశ్నించారు. మళ్లీ పొత్తు పెట్టుకుని ఇంతకు మించి హామీలు ఇచ్చి మీ దగ్గరకు రావడానికి రెడీ అయ్యారని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి చేయక పోగా ప్రజలకు మంచి చేసిన జగన్ ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజల సొమ్ము దోచుకుని దాచుకోవడానికి చంద్రబాబుకు అధికారం కావాలని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో టీవీ ఆన్ చేస్తే ఊక దంపుడు వాగ్దానాలు చేశారు… నరక లోకానికి, నారా లోకానికి వెళ్ళాలని ఎవరు అనుకోరని విమర్శించారు. అందుకే కిచిడి వాగ్దానాలు తెచ్చి స్వర్గం చూపిస్తున్నారని ఆరోపించారు. మన ఫ్యాన్ కు నవరత్నాలు అనే పథకం ద్వారా కరెంటు వస్తుంది… ఆ పథకాల ద్వారా నే మన ఫాన్ కు పవర్ వస్తుందని సీఎం జగన్ తెలిపారు.
ప్రొద్దుటూరులో విషాదం.. కుందూ నదిలో మునిగి అక్క తమ్ముడు మృతి
కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. రాజుపాలెం వద్ద నదిలో మునిగి అక్క తమ్ముడు గల్లంతయ్యారు. స్నానం కోసం కుందూ నదిలో దిగి మస్తాన్(27), ఇమాంబి(28) లు మృతి చెందారు. కుందు నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి అక్క తమ్ముడు మృతి చెందారు. మృతులు చాగలమర్రికి చెందినవారిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు ఉదయం ప్రొద్దుటూరులో స్వామిజి వద్దకు వెళ్లారు. వారి సమస్యలను స్వామిజీ చెప్పగా.. వారికి స్వామిజీ తాయత్తు ఇచ్చాడు. ఆ తాయత్తును నదిలో స్నానం చేసి కట్టువాలని సలహా ఇచ్చాడు. దీంతో.. అక్క తమ్ముడు ఇద్దరు కలిసి కుందు నది వద్దకు వచ్చి.. స్నానం చేసేందుకోసమని నీటిలోకి వెళ్లారు. అయితే.. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో వారిద్దరు నదిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం తెలియగానే కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ విషాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో తప్పిన ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం టు భవానీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. లోకో పైలట్ ఎం.హెచ్.ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరగా.. గంట వ్యవధిలోనే కొత్తవలస రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. కొత్తవలస రైల్వే స్టేషన్ ఫ్లాటుఫారం నెంబర్ 5 నుండి బయలుదేరిన రైలు.. రెండో నంబరు లైన్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది.
రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోంది.. మంత్రి కీలక వ్యాఖ్యలు
రానున్న ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోందని అన్నారు. కానీ.. పార్టీ కోసం పనిచేస్తానని సీఎం జగన్ కు చెప్పానని తెలిపారు. కాగా.. ఈసారి పోటీలో ఉండాలని సీఎం అంటున్నారు.. పార్టీ కష్టకాలంలో వదిలేసానని అపవాదు తనపై రాకూడదని చెప్పారు. మూడు రోజుల క్రిందట తాను ముఖ్యమంత్రిని కలిసానని.. ఈసారి తనను ఎంపీకి పోటీ చేసి తమ బాబుని అసెంబ్లీకి పంపిద్దామని తనతో సీఎం చెప్పినట్లు తెలిపారు.
అంతకుముందే తమ అబ్బాయిని ఈసారి నేను రెస్ట్ తీసుకుంటాను నువ్వు పోటీ చేస్తావా అని అడిగానని మంత్రి ధర్మాన చెప్పారు. వద్దు నాన్న నేను ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ తట్టుకోలేను.. నువ్వైతేనే సమర్ధుడవు అని మా అబ్బాయి అన్నాడని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి మళ్లీ నన్ను పోటీ చేయమనొచ్చు.. నేను సిద్ధపడవచ్చు అని పేర్కొన్నారు. ఏది జరిగినా అంతిమంగా గెలిపించవలసిన వారు ప్రజలు.. అందుకే తాను అన్ని కుల సంఘాలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
రేపు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అధికారికంగా ఖరారైన సీఎం పర్యటన వివరాలు ఇలా..
• సోమవారం ఉదయం 10.20 కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.25కు హెలికాప్టర్ లో బయలు దేరి 10.40 పులివెందులలోని భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
• 10.45కు అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయలు దేరి 10.55కు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు చేరుకుంటారు. 11.35 వరకు డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
• 11.35 రోడ్డుమార్గాన బయలు దేరి 11.45కు బనాన ఇంటి గ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12.10డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటారు. 12.25 వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు.
బీసీల శక్తిని గుర్తించింది వైఎస్సార్, జగన్..
రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి లోక్‌సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వీఎల్ పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ‘శెట్టిబలిజ, గౌడ ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. ఈ సభకు ఎంపీ భరత్ అధ్యక్షత వహించారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజమండ్రి లోక్‌సభ స్థానాలను బీసీలకే సీఎం జగన్ కేటాయించడం శుభపరిణామమని మంత్రి చెల్లుబోయిన అన్నారు. ఈ ముగ్గుర్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత బహుజనులు అందరిపైనా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. ఏ ఒక్క పార్టీ బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదన్నారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీలను తన సొంత తోబుట్టువులు మాదిరిగా బీసీల సంక్షేమాన్ని, రాజకీయంగా అగ్రస్థానంలో ఉంచారన్నారు.