రానున్న ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోందని అన్నారు. కానీ.. పార్టీ కోసం పనిచేస్తానని సీఎం జగన్ కు చెప్పానని తెలిపారు. కాగా.. ఈసారి పోటీలో ఉండాలని సీఎం అంటున్నారు.. పార్టీ కష్టకాలంలో వదిలేసానని అపవాదు తనపై రాకూడదని చెప్పారు. మూడు రోజుల క్రిందట తాను ముఖ్యమంత్రిని కలిసానని.. ఈసారి తనను ఎంపీకి పోటీ చేసి తమ బాబుని అసెంబ్లీకి పంపిద్దామని తనతో సీఎం చెప్పినట్లు తెలిపారు.
Read Also: Passenger Train: ఏపీలో తప్పిన ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
అంతకుముందే తమ అబ్బాయిని ఈసారి నేను రెస్ట్ తీసుకుంటాను నువ్వు పోటీ చేస్తావా అని అడిగానని మంత్రి ధర్మాన చెప్పారు. వద్దు నాన్న నేను ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ తట్టుకోలేను.. నువ్వైతేనే సమర్ధుడవు అని మా అబ్బాయి అన్నాడని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి మళ్లీ నన్ను పోటీ చేయమనొచ్చు.. నేను సిద్ధపడవచ్చు అని పేర్కొన్నారు. ఏది జరిగినా అంతిమంగా గెలిపించవలసిన వారు ప్రజలు.. అందుకే తాను అన్ని కుల సంఘాలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
Read Also: Tragedy: ప్రొద్దుటూరులో విషాదం.. కుందూ నదిలో మునిగి అక్క తమ్ముడు మృతి
మరోవైపు.. చంద్రబాబు తీరుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా మండిపడ్డారు. పథకాలతో రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించిన చంద్రబాబు మరిన్ని పథకాలు ఇస్తానంటున్నారని పేర్కొన్నారు. జగన్ పని అయిపోతే టీడీపీ ఎందుకు పొత్తులు పెట్టుకుందని దుయ్యబట్టారు. జనసేన, బీజేపీ పంచన ఎందుకు చేరారో చెప్పాలన్నారు. అయితే ఎన్ని పార్టీలు కలిసినా జగన్ కు తిరుగులేదని.. ఆయన వచ్చే ఎన్నికల్లో మరోసారి జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.