రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 13తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధత్తు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది వుత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధుల నుంచి ఎండోమెంట్…
ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుని చంద్రబాబు వృద్ధుల ఉసురు పోసుకున్నాడని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మండు టెండలో పింఛన్ కోసం వృద్ధులు పడుతున్న ఇబ్బంది చూసి బాధగా ఉందన్నారు. ఈ ఊరులో వరదరాజుల రెడ్డికి.. అక్కడ చంద్రబాబుకు కనికరం లేదన్నారు. చంద్రబాబు చేసినా దుర్మార్గమైన చర్యకు చంద్రబాబు ఒక్కరు ఓటు కుడా వేయరని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వృద్ధులకు, దివ్యంగులకు, వితంతువులకు ఈ…
నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, ఎస్.సి.కమిషన్ మాజీ సభ్యుడు బద్దేపూడి రవీంద్రలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరుతున్నారన్నారు. జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు వస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ పై ఫిర్యాదులు చేయించి.. పింఛన్ దారులను చంద్రబాబు ఇబ్బందులకు గురి చేశారన్నారు.…
గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఇవాళ ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని, ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారన్నారు. కిరణ్…
తాజాగా ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. హైదరాబాదులోని మలక్ పేటలో ఉన్న యశోద ఆసుపత్రిలో గుండెపోటు అనంతరం చికిత్స పొందుతూ ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ప్రస్తుత తరం వారికి అంతగా తెలియకపోయినా.. ముందుతరం వారికి తెలుగు దూరదర్శన్ అంటే మొదటిగా చెప్పే పేరు శాంతి స్వరూప్. రాత్రి అయితే చాలు ఆయన వార్తలు చదవటానికి ప్రత్యక్షమవుతారు. Also Read: Living Relationship Murder: నెలన్నరగా లివ్…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తానంటున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. నాకు అనుభవం ఉందని చెప్పుకోవడమే తప్ప పేదల పక్షాన ఇది చేస్తానని చెప్పే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. శవరాజకీయాలు చేసింది టిడిపి మంత్రులే అని ఆమె ధ్వజమెత్తారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఏర్పాట్లు చేయకుండా షూటింగ్ ల పేరుతో 32 మంది అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, వృద్ధులకు పెన్షన్లు అందకూడదని టిడిపి నాయకులు చేత ఎలక్షన్…
కరెంట్ పునరుద్ధరణ.. ఉప్పల్ స్టేడియంలో యధావిధిగా హైదరాబాద్, చెన్నై మ్యాచ్! ఉప్పల్ స్టేడియంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించని కారణంగా.. విద్యుత్‌శాఖ అధికారులు గురువారం (ఏప్రిల్ 4) స్టేడియంలో కరెంట్ నిలిపివేశారు. కరెంట్ నిలిపివేయడంతో ఒక్కసారిగా స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. జనరేటర్ల సహాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో అసలు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు చెలరేగాయి. ఏనుగు…
ఏపీలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచార జోరు కొనసాగుతోంది. సీతారాంపురంలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు.
కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఒక్క పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థాన్నాల్లో సీపీఐని బలపర్చటానికి కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందని, ఇటీవల హైదరాబాద్ నందు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా నివాసంలో ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నుంచి షర్మిలా, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర పార్టీ ప్రతినిధి కె.రాజు, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహ కార్యదర్శి ముప్పాళ్ల…
ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డి పాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లాలో నేతలతో ఆయన ప్రత్యేకించి మాట్లాడతారు. వారికి రానున్న ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో గెలుపు సాధించే దిశగా చేయాల్సిన ప్రయత్నాలపై దిశానిర్దేశం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు…