ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయింది అనే అసహనం కేటీఆర్ లో ఉంది.. మరో వైపు చెల్లె జైల్లో ఉందని ఆరోపించారు. ట్యాపింగ్ చేశాం అని కేటీఆర్ ఒప్పుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. విచారణలో వాళ్ళ బంధువులే నిజాలు చెప్తున్నారు.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడు.. తప్పుకు శిక్ష అనుభవిస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అనే వైపు విచారణ జరగాలని మంత్రి సీతక్క కోరారు.
USA: 22 ఏళ్ల క్రితం భారతీయ విద్యార్థిని చంపిన కేసులో దోషికి అమెరికాలో మరణశిక్ష అమలు చేశారు. ఓక్లహోమాలో భారతీయుడితో సహా ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపినందుకు 41 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. చెన్నై బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఎస్ఆర్ హెచ్ కు ఉప్పల్ స్టేడియం హోంగ్రౌండ్ అయినప్పటికీ, చెన్నైకు సపోర్ట్ గా మారింది.
మనందరి బతుకులు మార్చుకునేందుకు కీలకమైన సమయానికి వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల జలగ పాలనలో మనకేమైన మిగిలిందా.? మన జీవితాలు బుగ్గి అయిపోయాయన్నారు. అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి.. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందన్నారు.
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు.. అబద్ధాలు.. ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అసమర్థులు, చవట దద్దమ్మలు పాలనలో ఉన్నారు కాబట్టి ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో…
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన…
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా.. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా.. ముగ్ధుంపురంలో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై కేసీఆర్ ఆరా తీశారు. అయితే.. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని రైతులు కేసీఆర్ కు తెలిపారు. గతేడాది నీరు సమృద్ధిగా ఉండేదని.. ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని…
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద 15 గ్రాముల డ్రగ్స్ ను మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ సీజ్ చేశారు. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు ఎస్ఓటీ అధికారులు. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ బృందం.. నిందితుడు పాత నేరస్థుడుగా గుర్తించారు. దీంతో.. అతనిపై (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. నిందితుడు రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన సాఫ్ట్వేర్…