కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి.. మళ్ళీ ప్రజలను మోసం చేయొద్దు అని సూచించారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారు.. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో మీరే అధికారంలోకి వచ్చారు. కానీ అప్పుడు ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదని లేఖలో ప్రస్తావించారు. 2023లో కూడా తెలంగాణలో అనేక…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సమక్షంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుకోలేదని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీకి…
కిడ్నీలో రాళ్లు.. ఇది చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లేప్పుడు విపరీతమైన మంట వస్తూ ఉంటుంది. రాళ్ల పరిమాణం, సంఖ్యను బట్టి కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా వారాలు, నెలలు పట్టవచ్చు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్కు ఉప్పల్ హోంగ్రౌండ్. అయితే.. అక్కడ ఆ పరిస్థితులు కనపడటం లేదు. ఉప్పల్ స్టేడియం చుట్టూ పసుపుమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పసుపు జెర్సీలే కనపడుతున్నాయి. దానికి కారణమేంటంటే.. సీఎస్కే జట్టులో ధోనీ ఉండటం. ధోనీ అంటే.. క్రికెట్ అభిమానులకు ఎంతో అభిమానం.…
ఏపీలో పింఛన్ దారుల్లో వాలంటీర్లకు మంచిపేరు తెచ్చి పెట్టిందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. చంద్రబాబు హయాంలో రెండు మూడు రోజుల సమయం పట్టేదని.. పింఛన్ కోసం వెళ్లి ఎంతో మంది చనిపోయారని ఆయన విమర్శించారు. వాలంటీర్లు పింఛన్ దారులకు దేవుళ్లుగా కనిపించారన్నారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పాపన్నపేటలో నిర్వహించిన ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చినా రైతుబంధు రాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే.. వలసల మీద దృష్టి పెట్టాడని విమర్శించారు. కాంట్రాక్టర్లకు నిధులు…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. వచ్చేది పాల్ ప్రభుత్వమే... అధికారంలోకి రాగానే విశాఖను ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.
స్టేట్ జనరల్ అబ్జర్వర్లు వచ్చి జిల్లాను పరిశీలించారన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. స్టేట్ పోలీసు అబ్జర్వర్ 8న జిల్లాకి వస్తున్నారన్నారు. 8 మంది ఆర్వో లతో కోఆర్డినేషన్ జరుగుతోందన్నారు ఢిల్లీ రావు. సీజింగ్ లు అధికంగానే జరుగుతున్నాయి… 3 కేజీల గోల్డు, 4 కేజీల వెండి కూడా సీజ్ అయిందన్నారు. C-Vigil కంప్లైంట్ లు కూడా వస్తున్నాయన్నారు. లిక్కర్ సంబంధించిన కంప్లైంట్ లు తక్కువ సంఖ్యలోనే వచ్చాయన్నారు. నాలుగు రకాల లిక్కర్ 4300 లీటర్లు సీజ్…
టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమంగా ఉంటారని తెలిపారు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలోని రాజుల బజారు, వేమినేని రామస్వామి గారి వీధి, చాగంటిపాటి వెంకటప్పయ్య గారి వీధి, మక్లిమూడి వారి వీధిలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జ్ఞానేశ్వరి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటేసి…
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 13తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధత్తు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది వుత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా…