ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం)సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్లో గెలిచి సత్తా చాటింది. కాగా.. ఈ మ్యాచ్తో చెన్నై వరుసగా రెండు ఓటములను నమోదు చేసుకుంది. మ్యాచ్ జరిగింది హైదరాబాద్లో అయినప్పటికీ.. అభిమానులు అందరూ చెన్నైకి సపోర్ట్ చేశారు. అయినా చెన్నై విజయం సాధించలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
Read Also: RCB vs RR: రాజస్థాన్తో బెంగళూరు మ్యాచ్.. గెలుపు కోసం మార్పులు..!
ఏదేమైనప్పటికీ ఈ ఓటమిపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించారు. ఓటమికి గల కారణాలను చెప్పారు. పవర్ ప్లేలో హైదరాబాద్ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణమని రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ఈ పిచ్ చాలా స్లోగా ఉందని.. సన్ రైజర్స్ బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారన్నారు. ఉప్పల్ స్టేడియం నల్లరేగడి పిచ్ కావడంతో నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశామని పేర్కొన్నారు. కానీ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ మరింత స్లో అయిందని తెలిపారు. అంతేకాకుండా.. బౌలింగ్లో రాణించినప్పటికీ, తాము ఫీల్డింగ్లో తప్పిదాలు చేశామని చెప్పారు. అయినా ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకొచ్చాం అని రుతురాజ్ పేర్కొన్నారు. ఇక.. సీఎస్కే తర్వాతి మ్యాచ్ కోల్కతా నైట్రైడర్స్ ఉంది. ఈనెల 8వ తేదీన సోమవారం హోంగ్రౌండ్ చెన్నైలో జరుగనుంది.