ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగో మ్యాచ్ కాగా.. బెంగళూరుకు ఐదో మ్యాచ్. కాగా.. ఈ సీజన్లో మూడింటిలో మూడు గెలిచి రాజస్థాన్ మంచి ఫామ్లో ఉంది. రాజస్థాన్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక.. బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 ఓటములను చవి చూసింది.
Read Also: S Jaishankar: ఇది మోడీ గ్యారెంటీ.. లావోస్‌లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి..
ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలువాలనే కసితో బెంగళూరు జట్టు చూస్తోంది. అందుకోసం జట్టులో పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓపెనర్గా కింగ్ కోహ్లీ పరుగుల సునామీ సృష్టిస్తున్నా.. మిగతా బ్యాటర్లు ఎవరూ పరుగులు సాధించలేకపోతున్నారు. ఈ సీజన్లో కెప్టెన్ డుప్లెసిస్ కూడా రాణించకపోవడం జట్టుకు మైనస్గా మారింది. ఇకపోతే.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ కూడా బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు.
ఈ క్రమంలో.. గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన అనూజ్ స్థానంలో లోమ్రోర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే దినేష్ కార్తీక్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే బౌలర్ రీస్ టోప్లీ స్థానంలో న్యూజిలాండ్ స్పీడ్ స్టర్ లాకీ ఫెర్గూసన్ను ఆడించనున్నట్లు సమాచారం. ఇక ఆల్ రౌండర్ మనోజ్ భాండగే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశముంది.