నేడు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విరామం. నేడు నెల్లూరులోని ముఖ్యనేతలతో జగన్ సమావేశం. నెల్లూరు చింతరెడ్డిపాలెం దగ్గర సీఎం జగన్ బస. తెలంగాణలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ల ముందు రైతు సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో దీక్షలు. రూ.15వేల భరోసా, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్. క్వింటాల్ వడ్లకు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన ఉత్కంఠపోరులో పంజాబ్ విజయం సాధించింది. చివరి బంతికి శశాంక్ సింగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్ లో సూపర్ హీరో శశాంక్ సింగ్ (62*) పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ చివరి బంతికి విజయం సాధించింది.
అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆగడాలు ఆగటం లేదు. తాజాగా.. లంచం కేసులో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఓ), సబార్డినేట్ ఉద్యోగిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరందరినీ డ్రగ్ కంట్రోలర్ (ఇండియా) కార్యాలయంలో నియమించారు. వీరంతా లంచం తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు.. ఏప్రిల్ 8 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.
మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాల ఇచ్చాం రాష్ట్రంలో ప్రశ్నించాలంటే భయం రాయాలంటే భయం ఉండేది… అటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేదని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన గారెంటీలని అందిస్తున్నామని, మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాల ఇచ్చామన్నారు. నేతలు చేసిన వాగ్దానాలు మార్చి పోయారని లేని పోని అభాండాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరెంట్ పొకపోయిన పోయినట్లుగా ప్రభుత్వం పై విమర్శలు చేసి దిగజారుడు…
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాగళంకు భారీ స్పందన వస్తోందని.. వచ్చే 39రోజుల్లో జోరు పెరగాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. బందిపోట్లు పడ్డారు.. వారందరికీ నాయకుడు జగన్ అంటూ విమర్శించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బ్యాటింగ్ లో కెప్టెన్ శుభ్మాన్ గిల్ రాణించాడు. కేవలం 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 6 ఫోర్లు…