లెమన్ టీ, గ్రీన్ టీ పేర్లను మీరు ఎక్కువగా వినే ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. అదేవిధంగా, చమోమిలే టీ ఉంది, ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి విజ్ఞప్తి అంటూ కాపు బలిజ సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే కొన్ని సవరణలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు ప్రతిపాదించిన పెన్షన్ల వయోపరిమితి 50 సంవత్సరాలు అర్హులైన అన్ని కులాలకు వర్తింపజేయాలని కోరారు. బీసీలకు మాత్రమే ప్రతిపాదించిన రూ. 4 వేల పెన్షన్ అర్హులైన అన్ని కులాలకు వర్తింప చేయాలన్నారు.
జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జన జాతర సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే అనేక సందర్భాల్లో రాజకీయ సలహాలతొ పాటు ప్రజా సమస్యల పై పోరాట మార్గాన్ని ఇచ్చిన పెద్దలు జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ ఎవరి సహకారం లేకుండా…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాట్లాడుతూ.. జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు జగన్ మోహన్ రెడ్డి మీద తొడ కొడతాడంట అని విమర్శించారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకప్పుడు కొట్టుకున్నారని.. మళ్లీ రాజకీయం గురించి కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు రావులపాలెం టు యానాం ఏటిగట్టు రోడ్డు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు.
నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గల్లీ నుండి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు అని, సీఎం వద్ద ఏ పని కావాలన్నా నేను…
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రతి ఒక్కరికీ కాల్ చేసి, మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీ దారుల దగ్గర నుంచి రాజకీయ విరాళాలు సేకరించడం కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు.
Operation Chirutha: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత నాలుగురోజుకు చేరింది.