బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్‌లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్‌కు అనుబంధంగా ఉన్న టాయిలెట్‌కి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిసింది.
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఅర్ఎస్, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయంగా కడియం కావ్య ఎదురుకోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కడియం కావ్యను…
పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ఏలూరులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మన రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులు కోటీ 40 లక్షలు ఉన్నారని.. పేదలందరికీ పథకాలు అందాలా వద్దా అంటూ ముఖ్యమంత్రి అన్నారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే…
చంద్రబాబు హామీలను నమ్మే పరిస్థితి లేదు.. ఆయన మేనిఫెస్టోపై ఎవరికి నమ్మకం లేదు.. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.. ఆయన మేనిఫెస్టో పై ఎవరికి నమ్మకం ఉండదు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై హాట్ కామెంట్లు చే శారు.. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు…
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కార్లను భారతీయ కస్టమర్లు చాలా ఇష్టపడుతున్నారు. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. గత నెలలో టయోటా ఎన్ని యూనిట్లను విక్రయించింది? దీంతో పాటు.. కంపెనీ సంవత్సరం ప్రాతిపదికన ఎలా పనిచేసిందనేది తెలుసుకుందాం.
ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యం, డ్రగ్స్, నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. అక్కడక్కడా నగదుతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేసర్ మయాంక్ యాదవ్ గాయం తిరగబడినట్లు సమాచారం. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయన 3.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆయన కోటాను నవీన్ ఉల్ హక్ పూర్తి చేశారు. మయాంక్ పూర్తిగా కోలుకోకుండానే ముంబైతో మ్యా్చ్లో ఆడించినట్లు క్రీడా నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే గాయం తిరగబెట్టిందని భావిస్తున్నారు.
తెలంగాణ భవన్లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగలకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షలు కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్త్ లకు…