బుధవారం ఐసీసీ బ్యాట్స్మెన్ టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. అందులో టీమిండియా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టాప్-10లో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు చోటు దక్కించుకున్నారు. మరొక బ్యాటర్ యశస్వీ జైస్వాల్.. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ నీ, రాజ్యాంగాన్ని ఏ విధంగా అవహేళన చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వారం రోజులు నుండి రేవంత్ రెడ్డీ కి ఏమయిందో ఏమో కానీ ఆయన వ్యవహార శైలి ఆందోళన కరంగా ఉందన్నారు. అయన నిజస్వరూపం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పరిస్థితి దిగజారింది.. అపరిపక్వంగా , అహంకారం తో మాట్లాడుతున్నారన్నారు. సీఎం…
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. అయితే.. టీమిండియా జట్టులో ఫినిషర్ రింకూ సింగ్ పేరు లేకపోవడంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. మరోవైపు.. అతని తల్లిదండ్రులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేవలం రింకూ సింగ్ పేరు ట్రావెల్ రిజర్వుగా మాత్రమే ఉంది. మరోవైపు.. టీమిండియాకు ఫినిషర్ లేకుండానే మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. అయితే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ చర్యలు నేటి రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అనుచిత…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
సముద్రంలో బలాన్ని పెంచుకునేందుకు భారత నావికాదళం సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో (స్మార్ట్) వ్యవస్థ కోసం భారత్ విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించింది. బుధవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి 'SMART' వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. SMART అనేది తరువాతి తరం క్షిపణి-ఆధారిత తేలికపాటి టార్పెడో డెలివరీ సిస్టమ్.. ఇది తేలికపాటి టార్పెడోల యొక్క సాంప్రదాయ శ్రేణికి మించి భారత నావికాదళం యొక్క యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి…
అమెరికా-వెస్టిండీస్ లో జూన్ 2న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కాగా.. ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్ కు వెళ్లే నాలుగు జట్ల గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు. అయితే.. ఆ జట్లలో టీమిండియాకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. సోషల్ మీడియా వేదికగా అతడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఉప్పల్ స్టేడియం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. దీంతో.. రేపటి మ్యాచ్ పై నీలినీడలు అలుముకున్నాయి. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని సిబ్బంది ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగారు. కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది…