Patnam Sunitha Mahender Reddy : ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు దేవుడితో సమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్యుడ్ని దైవంతో పోలుస్తూ వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు నిజంగానే మరో దేవుడితో సమానం అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్కచేయక రోగులకు వైద్యం అందించడం గొప్ప విషయo అభినందనీయం అన్నారు. కూకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇంటరాక్షన్ విత్ డాక్టర్స్ పేరుతో డాక్టర్ విన్నకోట శ్రీ ప్రకాష్ సారథ్యంలో మైక్రో కేర్ ఈ ఎన్ టీ రీసెర్చ్ యూనిట్ ఆధ్వర్యం లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పట్నం సునీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డబ్బులకంటే సేవే ముఖ్యమనుకునే డాక్టర్లకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు.

Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
డాక్టర్ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ.. లీడర్స్ తో డాక్టర్స్ పరిచయ వేదిక ద్వారా ప్రజలకు జరిగే మేలు గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా కూకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ కు 1500 గజాల స్థలాన్ని కేటాయించినట్లయితే అక్కడ భవనం నిర్మించి 24 గంటలు పేద ప్రజలకు వైద్య సేవలు చేయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు సునీతకు వినతి పత్రం అందజేశారు. దీనిపైన సానుకూలంగా స్పందించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తల్లి ప్రాణం పోస్తే వైద్యుడు ప్రాణం నిలబెడతాడని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూకట్పల్లి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఒకే రోడ్లో అన్ని వ్యాధులకు చికిత్స చేసేలా హాస్పిటల్స్ ఉండడం అన్ని వైద్య సేవలు ఒకే దగ్గర లభించడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన డాక్టర్ విన్నకోట శ్రీ ప్రకాష్ ని ప్రస్తావిస్తూ లీడర్ లతో కలసి డాక్టర్లు సమాజ సేవలనే దృక్పథాన్ని అభినందించారుకూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ దేవుడి తర్వాత స్థానం ప్రాణాలు నిలిపి వైద్యుడి దే అన్నారు. వైద్యులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు అసోసియేషన్ కి సంబంధించి ఏ సమస్య ఉన్న పరిష్కారానికి కృషి చేస్తామన్నారు విద్యాధి కురాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పట్నం సునీతను గెలిపించాలని కోరారు. సమావేశంలో డాక్టర్లు సంపత్ రావు విన్నకోట శ్రీ ప్రకాష్ డాక్టర్ మధుసూదన్ డాక్టర్ రవి కుమార్ డాక్టర్ సంపత్ రావు,డాక్టర్ రవి కృష్ణ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!