సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అంబర్ పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్‌తో కలిసి అంబర్ పేట్ డివిజన్లోని న్యూ పటేల్ నగర్, నరేంద్ర నగర్, చెన్నారెడ్డి నగర్, సి బ్లాక్, రఘునాథ్ నగర్ కాలనీలలో పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు.
అస్పష్టమైన హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే లేకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన ఎక్స్ వేదికగా.. ‘ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు…
బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ 400కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనుకుంటోందని.. అది పేదల సంక్షేమం కోసం కాదని అన్నారు. వారి హక్కులను హరించేందుకేనని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి వర్గం మెజారిటీ దిశగా పయనిస్తోందని.. అది గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ నిరుత్సాహానికి గురయ్యారని తెలిపారు. అందుకే ‘మంగళసూత్రం’, ‘హిందూ’ అంటూ…
రేపటి(మే 1) నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8:30 గంటల నుంచీ 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు.
భూపాలపల్లి జిల్లా రేగొండ జన జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామాన్ని కెసిఅర్ ప్రభుత్వం చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రెవెన్యూ గ్రామము చేసి మన చిత్త శుద్దిని చాటుకున్నామన్నారు. సెమీ ఫైనల్ లో ఆరోజు కేసీఆర్‌ను ఓడించి బుద్ధి చెప్పామని, ఈ ఫైనల్ లో గుజరాత్ నుండి వచ్చిన మోడీ నీ ఒడగొట్టాలన్నారు. ఈ గడ్డ పైనా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. మరోవైపు.. రెండు టీమ్ లు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్‌డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత, మనమందరం ఆరోగ్యకరమైన, రిఫ్రెష్‌గా ఏదైనా తినాలని లేదా తాగాలని కోరుకుంటాము. అటువంటి పరిస్థితిలో మనలో చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో రసం తాగడం ద్వారా రోజును ప్రారంభిస్తారు.