నెల్లూరు రాజకీయాలను వీళ్లు నీచ స్థాయికి తీసుకువచ్చారు.. విజయసాయి రెడ్డి ఫైర్ నెల్లూరు రాజకీయాలను టీడీపీ అభ్యర్ధులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్‌లు నీచ స్థాయికి తీసుకువచ్చారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ దుష్టశక్తులుగా మారిపోయారని దుయ్యబట్టారు. వైసీపీకీ వెన్నుపోటు దారుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్లందరికీ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు…
ఎన్నికల్లో బీజేపీని ఓడించి పాతిపెడితే దేవుడికి ఏమీ పట్టదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం అన్నారు. ‘బీజేపీ నేతలు ఎప్పుడూ శ్రీరాముడి గురించే మాట్లాడతారు. మనం కూడా శ్రీరాముని పూజిస్తాం. హుజూరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పండుగలు, ఇతర సంప్రదాయాలతోపాటు అన్నీ నేర్పిస్తున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడి మరింత బలంగా పుంజుకుంటాం అని కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో మూడు రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మాజీ…
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో హృదయ విదారకమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఉద్యోగులు ఇస్లామాబాద్ నుంచి స్కర్దుకు వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి మృతదేహాన్ని విమానంలోకి తీసుకెళ్లడం మర్చిపోయారు. విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల బాలుడి మృతదేహం విమానాశ్రయంలోనే ఉండిపోయింది. డాన్ కథనం ప్రకారం.. అంతకుముందు చిన్నారి తల్లిదండ్రులు విమానం ఎక్కారు. అయితే.. పిఐఎ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరణించిన చిన్నారిని ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఉంచారు. దీంతో.. ఎయిర్‌లైన్స్ కంపెనీ ఉద్యోగులు తన…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అయిపోగానే మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామని ఆయన వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంగా ప్రతి రోజూ నేను రివ్యూ చేసే అంశం గౌరవెల్లి ప్రాజెక్టు అని, ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే నా లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్ కు మెడికల్ కాలేజ్…
రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమాకు త్వరలోనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తనను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం మాట ఇచ్చారు. తమకు ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కోరారు. గతంతో పోలిస్తే న్యాయవాదుల సంఖ్య పెరిగిందని, అందుకు తగినట్లుగా న్యాయవాదుల సంక్షేమ సంఘానికి తగినంత ఆర్థిక సాయం…
మే 13న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఉండనున్నాయని తెలిపింది. హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11వ తేదీన 302, 12 వ తేదీన 206 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు…
గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13 ఉదయం ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసిందని.. లిక్కర్ షాపులు బంద్ అయ్యాయని అన్నారు. మరోవైపు.. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తన్నవే మళ్లీ హామీలుగా చెప్తారా? అని, కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణ హామీలు అంతా డొల్ల అని ఆయన లేఖలో విమర్శించారు. కాంగ్రెస్ హామీలు, ప్రకటనలు ఆ పార్టీని మరింత దిగజార్చేలా ఉన్నాయని, తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. చాలా హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని, మరికొన్నింటిని అమలు…
ఉత్తరప్రదేశ్‌లోని ముస్సోరి పోలీస్ స్టేషన్ పరిధిలో 22 ఏళ్ల యువతికి చదువు చెబుతానని చెప్పి రెండేళ్లుగా బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేస్తున్న నిందితుడు మౌలానాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వీడియో తీసి బాలికను బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి గ్రామంలోని మసీదులోని మౌలానా వద్ద చదువుకునేది. రెండేళ్ల క్రితం నిందితుడు యువతిని బెదిరించి అత్యాచారం చేసి దానిని వీడియో తీశాడు. ఆ తర్వాత…
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని రాష్ట్ర రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పురూలియా ఎస్పీ అవిజిత్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ట్రక్కు మొదట ఓ బైక్‌ను ఢీకొట్టగా.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు.