దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల 7 దశల్లో జరుగనున్నాయి. అయితే ఈ రోజు 4వ దశ పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. అయితే.. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే.. ఏపీలో ఇప్పటికే దాదాపు 15 శాతం ఓటింగ్ జరిగింది. అయితే.. లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి ఓటర్లు చైతన్య పరుస్తూ.. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా కోరారు.
మోడీ ట్విట్టర్‌లో.. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను.ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను.’ అని అన్నారు.
అలాగే.. ‘తెలంగాణలో నేడు నాలుగో దశ పోలింగ్ జరగనుంది. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించి, సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపి, రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు మరియు అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. అభివృద్ధి, మరియు సమాన అవకాశాలను అందించడం ద్వారా SCలు, STలు మరియు OBCలకు అధిక లాభం చేకూరుతుంది.
లోక్ సభ ఎన్నికల నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరగనుంది. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించి, ప్రోత్సహించి, రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన పంజాల నుండి విముక్తి చేసి, ఎస్సీ, ఎస్టీలు మరియు ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని అమిత్ షా ట్వీట్స్ చేశారు.