ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచవ్యాప్తంగా 'అంతర్జాతీయ నర్సుల దినోత్సవం' జరుపుకుంటారు. ఈ నర్సుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది?.. ఈ సంవత్సరం థీమ్ ఏమిటో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్‌ను దాటేసినందుకు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడింది.
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ముగ్గురు కార్ డీలర్లను కిడ్నాప్ చేసి, వారి ప్రైవేట్ పార్ట్‌లపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆందోళనకరమైన వీడియోలు, కిడ్నాపర్లు నగ్నంగా ఉన్నప్పుడు పురుషుల ప్రైవేట్ భాగాలకు విద్యుత్ షాక్‌లు ఇస్తున్నట్లు చూపుతున్నాయి.
ఈ ఏడాది మే 12 తేదీ ప్రపంచంలో చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే.. ఈరోజు మదర్స్ డే. కానీ ప్రతి సంవత్సరం మే 12న మదర్స్ డే జరుపుకోరు. ఈ తేదీ మారుతూ ఉంటుంది. మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకునే ఆచారం మారదు.
భూ వైకుంఠంలో వెలసిన విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆర్మీ బ్యాండ్ మేళవింపుల నడుమ సంపూర్ణ ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణలు, బద్రీ విశాల్ లాల్ కీ జై అనే నినాదాలతో భక్తుల కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా.. 16 ఓవర్లకు కుదించడంతో.. 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ముంబై ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అభివృద్ధి కావాలో, విధ్వంసం కావాలో ప్రజలే తేల్చుకోవాలని బీఆర్ ఎస్ కరీంనగర్ అభ్యర్థి బీ వినోద్ కుమార్ అన్నారు. అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రగతి రికార్డును దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ను గెలిపిస్తే కరీంనగర్ మళ్లీ చీకటి రోజులలోకి వెళ్తుందని అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం సంజయ్‌కుమార్ ప్రధాని మోదీని…
హై ఆక్టేన్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం ముగియడానికి కొన్ని గంటల ముందు, తెలంగాణలో బీఆర్ఎస్ 12 నుండి 14 సీట్లు గెలుచుకుంటుందని ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే దేశాన్ని శాసిస్తాయని పేర్కొన్న ఆయన, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని సూచించారు. “ప్రాంతీయ పార్టీలు షరతులు నిర్దేశించి దేశాన్ని పాలించబోతున్నాయని నా అనుభవంతో చెప్పగలను. ఇక్కడ తెలంగాణ భవన్లో…
ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరించింది. రేపు (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంతో టాస్ ఆలస్యమైంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 9.15 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంతో ఇరు జట్లకు ఓవర్లు తగ్గించారు. రెండు టీమ్‌లు 16 ఓవర్లు ఆడనున్నాయి.