అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం వీఆర్‌పురం మండలం మారుమూల గ్రామాలలో ఎన్డీఏ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత, రంప చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవి రోడ్డు షో ప్రచారం నిర్వహించారు. రోడ్డు పొడవునా ప్రజలు బారులు తీరి.. ఆదివాసి గిరిజనులు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో పాటు.. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై నినాదాలు చేశారు.
ఇప్పటి వరకు మూడు దశలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 200 సీట్లలో విజయం సాధించనున్నామని ధీమా వ్యక్తం చేశారు అమిత్‌షా. ఇవాళ ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. 400 సీట్ల గెలుపు దిశగా వెళ్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం పైన పైసా కూడా అవినీతి చేయలేదని, అలసి పోగానే బ్యాంకాక్, థాయిలాండ్ ఎవరు వెళ్తారో మీకు అందరికీ తెలుసు అని ఆయన…
ఏలూరు జిల్లా కైకలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావని పేర్కొన్నారు. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలు అన్నారు. జగన్‌కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని తెలిపారు. ఇంటింటి అభివృద్ది చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు.…
మరో గంటలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ముగుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. మిగతా 106 నియోజకవర్గంలో 6 గంటల తర్వాత ప్రచారం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తారని ఆయన వెల్లడించారు. ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బల్క్ sms లు నిషేధమని, జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధమని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని…
వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని చెప్తే.. తాను, అమర్నాథ్ పోటీ నుంచి తప్పుకుంటామని అన్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్లో పోరాటం చేశానన్నారు.
రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సోదరుడు అని.. వాళ్ళిద్దరిది రాజకీయ సంబంధమే కాదు అన్నాతమ్ములు లాగా కలిసిమెలిసి ఉండేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కడపలో రాహుల్ ప్రసంగించారు.
ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అగ్రనేతలంతా జోరుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీజాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి విచ్చేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉక్కపోత, వేడిగాలుల నుండి ప్రజలు త్వరలో ఉపశమనం పొందబోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్‌లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా దీన్ని ప్రముఖంగా ప్రచురించింది. డాన్ ఈ వార్తను హెడ్లైన్ చేసింది.