మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. తనకు స్నేహితుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని క్లాస్ రూమ్ లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘనపూర్ లోని హ్యాపీ ఆరఫాన్ హోమ్ లో ఘటన చోటు చేసుకుంది.. కాసర్ల సతీష్ కుమార్తె స్వప్న (20) తన చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల అతని తండ్రి అయిన సతీష్ 2009వ సంవత్సరంలో ఆర్ఫాన్ హోమ్ లో చేర్పించాడు.. స్వప్న ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ ఒకేషనల్ కోర్స్ MPHW చదువుతున్నది. గత నెలలో రిజల్ట్ రావడం వల్ల తనకు 1000 మార్కులకు గాను 700 మార్కులు వచ్చినవి అయితే తనకు మార్కులు తక్కువగా వచ్చినయని తోటి విద్యార్థులకు చెప్తూ బాధపడుతుండేది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో క్లాస్ రూమ్ లోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్ఫన్ హోమ్ వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..