ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల ముందు.. ఓటర్లకు ప్రలోభాలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా.. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈసీ ఎన్ని పకడ్బంధీ చర్యలు చేపట్టినప్పటికీ డబ్బులు, మధ్యం పంపిణీ జరుగుతుంది. అంతేకాకుండా.. డబ్బుల పంపిణీ విషయంలో కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి.
Breaking News : పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ప్రఫుల్ రెడ్డికి పాముకాటు
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నెలో డబ్బుల పంపిణీ విషయంలో టీడీపీ కార్యకర్తలు ప్రణీత్, సుధాకర్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ప్రణీత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మరోవైపు.. ప్యాపిలి మండలం కౌలుపల్లిలో కూడా ఇలాంటి ఘర్షణే చోటు చేసుకుంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ విషయంలో వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తాయి. ఈ క్రమంలో.. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో రామకృష్ణారెడ్డి, వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తులకు గాయాలయ్యాయి.
MS Dhoni: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ కాదు.. చెన్నై ట్వీట్ వెనక అసలు విషయం ఏంటంటే!
అటు.. కడప జిల్లా బద్వేల్ టిడిపి కార్యాలయం వద్ద కూటమి నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అగ్రహారం గ్రామానికి సంబంధించి ఓటర్లకు డబ్బు మేము పంచుతాము అంటే మేము పంచుతాము అని టిడిపి జనసేన మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది. పోలింగ్ రోజు ఏంజట్లు మా పార్టీ వాళ్లు కూర్చోవాలి అంటే మా పార్టీ వాళ్లు కూర్చోవాలని కూడా ఘర్షణకు కారణమైంది. ఈ క్రమంలో జనసేన నాయకుడి వేలును టీడీపీ నాయకుడు కొరికేశాడు. కాగా.. ఇరు వర్గాలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.