ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటైంది. సీఈసీ ఆదేశాలతో సిట్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ విచారణ జరపనుంది. 13 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్.. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌పై దాడి చేశాడు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను బిభవ్ ఏడు సార్లు చెంపపై కొట్టడమే కాకుండా, సున్నిత భాగాలపై కడుపులో తన్నాడని ఆమె ఆరోపించింది. ఈ రోజు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్…
ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రేపట్నుంచి(ఈ నెల 18) ఈ నెల 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్ఐసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన పనుల పురోగతి, వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద పనులు పురొగతిని వేగవంతం చేసి పూర్తి చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను సి.ఎస్ అభినందించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీ జూన్ 12 లోగా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పాఠశాలలు…
టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలిసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొందరు రాజకీయ నేతలను ఇరికించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆరోపించింది . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) యొక్క బలవంతపు చర్యలను చట్టవిరుద్ధం, అనైతికం , రాజ్యాంగ విరుద్ధమని బిఆర్ఎస్ పేర్కొంది, ఈ ఏజెన్సీలు బిజెపి పంథాను అనుసరించని ఎక్కువ మంది రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. శుక్రవారం తీహార్ జైలులో…
అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారంపై వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.
ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో విజయం సాధించి టోర్నీని ముగించాలని ప్రయత్నిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ చాలా కాలంగా ప్లేఆఫ్ రేసు నుండి దూరంగా ఉంది.
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం 66వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం కారణంగా అర్థరాత్రి వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేయడంతో ఇరు జట్లకు ఒక్కొక్క పాయింట్ లభించింది.
తెలంగాణకు ఇంధన అవసరాలు డిసెంబర్లో 8,622 మిలియన్ యూనిట్లు మరియు మార్చి 2025 నాటికి 10,177 MUలకు చేరుకునే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అసాధారణంగా పెరిగింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ప్రకారం మార్చిలో తెలంగాణ ఇంధన వినియోగం ఇప్పటికే 9,009 మిలియన్ యూనిట్లకు చేరుకోగా, రానున్న నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. CEA నివేదిక ప్రకారం, మార్చిలో 9,009 MU వినియోగంతో తెలంగాణ దేశంలో…