Students Missing in Godavari: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గౌతమి గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతు అయిన వారిని రావులపాలెంకు చెందిన సబ్బెళ్ళ ఈశ్వరరెడ్డి, సత్తి సంపత్‌రెడ్డి, పెంటా జయకుమార్‌లుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు నది వద్దకు చేరుకున్నారు. వారి ఆచూకీ కోసం వేచి చూస్తున్నారు. స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ప్రజలకు హెచ్చరిక ఇదే!