బెంగళూరులో గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. కాగా.. ఈరోజే వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే.. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ జరుగుతుందా అన్న సస్పెన్స్ కు తెరదించింది. ఆర్సీబీ, సీఎస్కే అభిమానులకు కర్ణాటక వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. కాసేపట్లో జరగనున్న నాకౌట్ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని తెలిపారు. ప్రస్తుతానికి వర్ష సూచనలు లేవు.. రాత్రి వరకు అనుకూల పరిస్థితులే ఉన్నాయని ట్వీట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు.. అటు ఆర్సీబీ అభిమానులు, ఇటు సీఎస్కే అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా తరలి వచ్చారు. దీంతో.. స్టేడియం వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది.
Read Also: Kalki 2898 AD: బుజ్జి బుజ్జి బుజ్జి.. అసలు ఎవర్రా ఈ బుజ్జి..?
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో.. అటు జట్లతో పాటు, ఇరుజట్ల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా.. చివరి బెర్త్ కోసం చెన్నై, ఆర్సీబీ మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది.