ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం 3 జిల్లాల్లో జరిగిన హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు.
సీఈఓ వికాస్ రాజ్ ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు శుక్రవారం కలిశారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓ కు ఫిర్యాధు చేశారు రఘునందన్ రావు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఒక్కో ఓటర్ కు 5వందల రూపాయలను పంపిణీ చేశారని, ఎన్నిసార్లు ఫిర్యాధు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదన్నారు. బూత్ ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్ లలో ఒక్కో గ్రామానికి డబ్బుల పంపిణీ చేశారని, 20కి…
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్పీఎస్సీ తాజాగా అప్డేట్ ఇచ్చింది.
ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్ది ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఘోష పేడుతుందని, తరుగు గతం కంటే ఎక్కువ తీస్తున్నారన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని, ఉత్తం కుమార్ రెడ్డి కూడా స్పందించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బోగస్ ప్రభుత్వం గా మారిందని, 5 ఎకరాల వరకే రైతు భరోసా అని చెప్పడం…
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి (65) పై బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (హైదరాబాద్ – విజయవాడ ఎక్స్ప్రెస్వే) విజయవాడ, హైదరాబాదు లను కలిపే 181 కిలోమీటర్ల నాలుగు నుంచి ఆరు వరుసల జాతీయ రహదారి. ఇది మచిలీపట్నంను పూణేతో కలిపే జాతీయ రహదారి 65 లో ఒక భాగం. దీనిని రెండు వరుసలనుండి విస్తరణ పని పూర్తి చేసి అక్టోబర్ 2012 లో ప్రారంభించారు.…
తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో గల ‘కుర్తాళం’ జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు.
భర్త, అత్తపై కోడలు అరాచకం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దాడి అత్తలేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది సామెత.. అంటే వీరిలో ఎవరో ఒకరు మాత్రం ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. లేదంటే రచ్చ రంబోలానే.. గతంలో అత్త, భర్త హవా నడిచేది. భర్త, అత్త కూర్చోమంటే కూర్చునేవారు.. నిలబడమంటే నిలబడేవారు.. అలా హుకుం జారీ చూస్తూ వారి పెత్తనాలు సాగుతుండేవి. అలా అని గడసరి కోడళ్లు కూడా లేకపోలేదండోయ్. అత్త, భర్త ప్రవర్తన,…
జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించవద్దంటూ ఆయన హితవు పలికారు.
దిష్టిబొమ్మ గురించి మనందరికీ తెలిసిందే. షాపులో, ఇంటిముందు దీన్ని చూసే ఉంటారు. అయితే.. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఫోటో తెగ వైరల్గా మారింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆవిష్కరణలు కూడా పెరుగుతున్నాయి. చాలా దృశ్యాలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వన్ టు వన్.. వేల మంది వీక్షించే విషయాన్ని ఒక్కరు తెలుసుకుని షేర్ చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, డ్యాన్స్, డైలాగ్, టాలెంట్ షో, సీరియస్, ఫన్నీ, ఏదైనా షేర్ చేయండి. సామాన్యులు ఆసక్తిగా…
అల్లర నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం.