ఎగ్జిట్ పోల్స్ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126 ఏ (1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు 100 దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ ఒకటేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-ఆపరేషన్స్ టి.రఘునాథరావు పదవీ విరమణ పొందారు. చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ - ఆపరేషన్స్ పి.జీవన్ ప్రసాద్‌తో పాటు మరో ఏడుగురు రిటైర్డ్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీకి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన వారిని టీజీఎస్ఆర్టీసీ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికింది.
బకాయిలు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (KRIDL) పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. దావణగెరెకు చెందిన కాంట్రాక్టర్ ప్రసన్న (50) సంతాబెన్నూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మనోవేదనలను వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాశాడు.
ఒడిశాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలాలోని హేమ్గిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్తాలీ వ్యాలీలో ప్రమాదవశాత్తు బొలెరో వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కార్మికులు అక్కడికక్కడే మరణించారు.. వాహనం డ్రైవర్ సహా మరో ఏడుగురికి గాయలయ్యాయి. ఉదయం కూలీలు పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ట్యాక్సీ రైడర్ అవతారమెత్తి ఓ దొంగ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఓలా ట్యాక్సీ రైడర్‌గా ఉంటూ.. ప్రయాణికుల వద్ద నుంచి పలు వస్తువులను కొట్టేసేవాడు. తాజాగా.. ఓ మహిళ బ్యాగ్‌తో పారిపోయి పోలీసులకు చిక్కాడు. ఆ బ్యాగ్‌లో ఐఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని సొసైటీలో నివసిస్తున్న అధీరా సక్సేనా అనే మహిళ ఓలా బైక్‌ను బుక్ చేసింది. బైక్ పై ప్రయాణం చేసి…
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మాడు పగిలే ఎండ, వడగాల్పులు.. మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం 23 శాతానికి పడిపోయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 77 శాతం తక్కువగా ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నిల్వ గత సంవత్సరం స్థాయిలలో 77 శాతం తక్కువగా ఉందని.. సాధారణ నిల్వలో 94 శాతం ఉంటుందని సీడబ్ల్యూసీ డేటా పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన సీడబ్ల్యూసీ బులెటిన్‌లో.. "అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ 41.705 బిలియన్ క్యూబిక్ మీటర్లు (BCM),…