డ్రగ్స్‌ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. డబ్బుల కోసం ఎంతటి సాహాసానికైనా వెనుకాడటం లేదు. అయితే.. ఈసారి స్మగర్లు చిన్న పిల్లల లంచ్ బాక్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఆ బాక్స్ కస్టమ్ అధికారుల కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూడగా.. రూ. కోటి కంటే ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ లభ్యమైంది.
నేడు ఎగ్జిట్ పోల్స్.. 19 రోజులుగా అభ్యర్థుల్లో టెన్షన్ పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం అయితే.. ఫలితాల కోసం 19 రోజుల పాటు ఎదురుచూడడం మరో ఆందోళన. ఈవీఎంలలో తీర్పు నమోదవడంతో ప్రజలు ఎటువైపు ఓటేశారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్ నుంచి కొంత మందికి నేడు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. చివరి…
రక్షించాల్సిన పోలీసులే.. భక్షకులుగా మారుతున్నారు. కన్ను మిన్ను కానకుండా స్త్రీలపై తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. బైక్‌పై వెళ్తున్న ఓ జంటను పోలీస్ వాహనంలో తన స్నేహితుడితో కలిసి వచ్చిన ఓ హోంగార్డ్ అడ్డగించి, బెదిరించి మహిళను తుప్పల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి కుమిలి వెళ్లే రహదారిలో బైక్‌పై తన కుటుంబసభ్యుడితో కలిసి వెళ్తున్న సుమారు 45 ఏళ్ల వయసు…
వేసవి కాలంలో విరివిగా వచ్చే మామిడి పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ధరతో సంబంధం లేకుండా పండ్లను తింటుంటాం.. అయితే… ప్రారంభంలో ధర పెరిగినా మార్కెట్‌కు పండ్ల సరఫరా పెరగడంతో ధర తగ్గుతుంది. అయితే.. ఎక్కడ చూసినా చాలా రకాల మామిడిపండ్లు ఉన్నాయి. ఇవన్నీ సాధారణంగా సీజన్లో కిలో రూ.100 నుంచి 200 వరకు పలుకుతుండగా, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పండే జపనీస్ రకం మామిడి పండ్ల ధర మాత్రం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.…
ప్రస్తుత జీవనశైలి ప్రకారం, చాలా మంది ప్రజలు కేవలం 50 ఏళ్ల వయస్సులోనే వృద్ధాప్యంగా కనిపిస్తారు. ఎంత మేకప్ వేసుకున్నా ముడతలు పడిన చర్మాన్ని దాచుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా మెడ, చేతులు పాతవిగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అమ్మమ్మ వయసులో ఉన్న ఓ మహిళను ఒక్కసారి అలా చూస్తే షాక్ అవుతారు. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోకండి. ఆ రహస్యాన్ని ఆమె మాటల్లోనే వినండి. మే 27న, వెరా వాంగ్ తెల్లటి స్విమ్‌సూట్ ధరించి…
ఉక్రెయిన్‌కు చెందిన ఒక మోడల్ (సావా పాంటీజ్‌స్కా) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై చట్టపరమైన కంప్లైంట్ చేసింది. రెడ్ కార్పెట్‌పై నడుస్తుండగా సెక్యూరిటీ గార్డు ఆమెతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి.
దేశ వ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంత ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నాగ్‌పుర్‌లో ఓ వాతావరణ స్టేషన్లో గురువారం ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. దీంతో.. జనాలు బెంబెలెత్తిపోయారు. అయితే.. అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు రీసెర్చ్ చేసి నిజం కాదని తేల్చింది.…
ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం గురించి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు అర్ధరాత్రి 12:45 గంటలకు పోలీసులు సమాచారం అందించారు. కాగా.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 12 అగ్నిమాపక దళ వాహనాలను ఘటనాస్థలికి తరలించారు.
భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు 68,000 రూట్ కిలోమీటర్ల రైల్వేలు ఉన్నాయి. మీరు సురక్షితమైన ప్రయాణం , తక్కువ ఛార్జీలతో రైలులో ప్రయాణించవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలించనప్పుడు లోకో పైలట్‌కి రైలును నడిపించడం కష్టంగా మారుతుంది. అయితే, ఇంజిన్‌లోని శాండ్బాక్స్ ఈ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది. ఇప్పుడు దాని గురించి…
హిమాచల్ అడవిలో చెలరేగిన మంటలు.. భారీ ఆస్తి నష్టం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని డింగు అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ సీజన్లో బిలాస్‌పూర్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అడవులు కాలిపోతున్నాయి. ఒక్క బిలాస్పూర్ జిల్లాలోనే బండ్ల, పర్నాలి, సిహ్రా, లోయర్ భటేడ్, కుడ్డి, బర్మానా, నయనదేవి, భరడి, ఘండిర్‌తో సహా పలు ప్రాంతాల్లోని అడవులు దగ్ధమయ్యాయి. రాజధాని సిమ్లా అడవులు కూడా దగ్ధమవుతున్నాయి. భారీ అగ్నిప్రమాదం కారణంగా.. ప్రపంచ వారసత్వ కల్కా-సిమ్లా రైల్వే మార్గంలో రైలు…