ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది. దీంతో.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ప్రమాదానికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also: Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
మృతులు.. బుదౌన్ జిల్లాకు చెందిన ప్రకాష్ (42), బ్రజ్‌పాల్ (35), ధనపాల్ (55), జ్ఞాన్ సింగ్ (40)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. “జిల్లాలోని పైగామ్ భికంపూర్ గ్రామంలో ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఓ వ్యాన్ అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు.. మరో ఇద్దరు గాయపడ్డారని.. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ చెప్పారు.
Read Also: T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం!
ఈ ఘటనపై స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వ్యాన్ డ్రైవర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు. “మేము స్థానికులతో టచ్‌లో ఉన్నాము. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చాము” అని మేజిస్ట్రేట్ తెలిపారు. శనివారం సాయంత్రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రామంలో పోలీసు సిబ్బందిని మోహరించారు.