Kunamneni Sambasiva Rao: తెలంగాణ ధనిక రాష్ట్రమా.. పేద రాష్ట్రమా?.. అర్థం కావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunamneni Sambasiva Rao: నూతన తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ శాసన సభాపక్ష నేత కూనమనేని సాంబశివరావు వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమా..? పేద రాష్ట్రమా అనేది అర్థం కావటం లేదన్నారు. తెలంగాణలో ఏ రంగం కూడా సంతృప్తిగా లేదన్నారు. సింగరేణి మాజీ సీఎండీ శ్రీధర్ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. సింగరేణి పదేళ్ల కుంభకోణాలపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు గెస్ట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగం, ఇరిగేషన్ రంగంలో కూడా పూర్తిగా వైఫల్యాలు ఉన్నాయన్నారు. ఉద్యోగ కల్పన, రైతాంగం, వ్యవసాయంపై, అభివృద్ధిపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.
Read Also: Illegal Sale of Ganja: గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్టు.. 1.57కిలోల సరుకు పట్టివేత
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
కేసీఆర్ ఓడిపోయి అదృష్టవంతుడైనాడని, వీరిపాపాలు నేడు కాంగ్రెస్ మోస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై మా నిరంతర పోరాటం ఆగదన్నారు. తెలంగాణ గీతంపై, రాష్ట్ర చిహ్నంపై బీఆర్ఎస్ తీరు ఆక్షేపనీయమని, ఇలాంటి వాటిపై కాకుండా ప్రజా సమ్యసలపై దృష్టిపెట్టాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ బతికుండాలని ఆయన పేర్కొన్నారు. తప్పుడు పద్దతుల్లో మత విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీ దేశ అభివృద్ధి పూర్తిగా విఫలం అయిందని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీకి తెలంగాణలో స్థానం ఉండకూడదంటే బీఆర్‌ఎస్ బతకాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమన్నారు. డబ్బులతో పని లేని ఎన్నికల కోసం పోరాటాలు చేస్తామన్నారు. ప్రజల కోసం పుట్టిందే కమ్యూనిస్టు పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..