అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం. నేటితో ముగియనున్న అరునాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు. అసెంబ్లీల గడువు ముగియనుండటంతో ముందుగానే ఓట్ల లెక్కింపు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 స్థానాలు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 10 సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న బీజేపీ.
తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.72,550 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.66,500 లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.98,000 లుగా ఉంది.
నేడు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు.
నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో వేడుకలు. పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.
నేటి నుంచి టీ20 ప్రపంచకప్ 2024. టీ20 ప్రపంచకప్‌లో నేటి మ్యాచ్‌లు. వెస్టిండీస్ వర్సెస్ పాపునా న్యూగినియా. ఉదయం 10.30 డల్లాస్ వేదికగా మ్యాచ్. రాత్రి 7.30కి యూఎస్‌ఏ-కెనడా మ్యాచ్. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6 గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది.
కోస్తాంధ్రపై తుఫాను, నేడు ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు. ఈసారి నైరుతీ రుతుపవనాలు మన ఆశలకు తగినట్లుగానే ఉంటున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జోరుగా ఉన్న ఈ గాలులు.. దక్షిణ భారత్‌లో విస్తరిస్తూ ఉన్నాయి. నిన్న కన్యాకుమారిని టచ్ చేశాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతీ బంగాళాఖాతంలో ఈ రుతుపవనాలు వస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) చెప్పింది.
బెయిల్‌పై కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు వెళ్లనున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు జూన్ 5న నిర్ణయం తీసుకోనుంది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. దీంతో కేజ్రీవాల్ నేడు జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంది.
రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో నేడు ట్రాఫ్రిక్ ఆంక్షలు. ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు