ఎయిమ్స్ పరిశోధనలో కీలక విషయాలు బయటికొచ్చాయి. చనిపోయిన మనిషి నుండి శిశువు జన్మిస్తుందని పరిశోధనలో వెల్లడించింది. భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహించిన పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి సేకరించిన శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలపాటు జీవించగలవని తేలింది. దీంతో ఏ స్త్రీ అయినా తల్లి కాగలదు అని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆహ్వానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ హర్కర వేణుగోపాల్ రావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.
ఢిల్లీలో ఎండలతో పాటు తీవ్రమైన వేడిగాలులు అక్కడి ప్రజానీకాన్ని బెంబెలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టి్స్తున్నాయి. తాజాగా.. మొన్నటికి మొన్న ఢిల్లీలోని ముంగేష్ పురిలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈ క్రమంలో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జనాలతో పాటు జంతువులు, పక్షులు ఎండలకు అలమటిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు ఆవరణలో నివసించే జంతువులు, పక్షులకు తగిన ఆహారం, నీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)…
చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణమైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్ 7, 8వ తేదీల్లో తాజ్ కృష్ణా హోటల్లో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
విమానాలు ఆలస్యమై ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే సంఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గురువారం (మే 30) దేశ రాజధాని ఢిల్లీ నుండి బయలుదేరాల్సిన ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానం కొన్ని కారణాల వల్ల 24 గంటలు ఆలస్యమైంది. ఈ క్రమంలో డీజీసీఏ ఈ చర్య తీసుకుంది.
దేశంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపుల కాల్ వచ్చింది. శుక్రవారం నాడు 177 మంది ప్రయాణికులు, ఒక శిశువుతో శ్రీనగర్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో.. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే.. విమానయాన సంస్థ, భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో…
తెలంగాణలో మరో కీలక పరిణామం జరిగింది. టెస్కాబ్ ఛైర్మన్ పదవికి కొండూరి రవీందర్ రావు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం రవీందర్రావు మీడియాతో మాట్లాడుతూ.. సహకార సంఘంలోని కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తాను పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు.
లంచం తీసుకుంటూ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. నీటి పారుదల శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీర్లతో పాటు సర్వేయర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు కార్తీక్, నికేష్ కుమార్‌తో పాటు సర్వేయర్ గణేష్‌ను ఏసీబీ అరెస్టు చేసింది.
భారతదేశంలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీతో సహా పలు చోట్ల మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో.. 54 మంది మృతి చెందారు. మే 31 నుంచి జూన్ 1 వరకు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. మే 31 నుంచి జూన్ 2…