పూణె పోలీస్ పోర్షే కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. పోర్షే కారు ప్రమాదం కేసులో యువకుడి రక్త నమూనాలను అతని తల్లితో మార్చుకున్నట్లు నిర్ధారించిన తర్వాత పూణె పోలీసులు యువకుడి తల్లిని సైతం అరెస్టు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా.. గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు ఓల్డ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ (బాలికలు) బూత్ నంబర్ 223లో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకుని తన ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన తన బూత్‌లో తొలి ఓటు వేశారు. అంతకు ముందు.. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2023 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన బూత్‌లో మొదటి…
ఏపీలో నేడు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ కావడంతో పింఛన్లు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 65.30 లక్షల మందికి నేటి నుంచి పింఛన్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 1,939 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. 80 సంవత్సరాలు పై బడిన పెన్షన్ దారులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించనున్నారు. మిగిన లబ్ధిదారులకు గత నెలలో లాగా బ్యాంకులో జమ చేయనున్నారు.…
పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు కిమ్ జోంగ్ దిగారు. కానీ, ఈసారి క్షిపణులు, బాంబులతో మాత్రం కాదు. బెలూన్లతో తమ దేశంలోని చెత్తను దక్షిణ కొరియాలో జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నారు.
జగన్ రెడ్డి మోహన్ తన లండన్ పర్యటన నుండి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఏపీకి చేరుకున్నారు. లండన్ నుంచి రాష్ట్రానికి సీఎం కుటుంబం చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టిజె, సుధాకర్…
భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా డజన్ల కొద్దీ మరణించారు. తాజాగా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రాల్లో మోహరించిన దాదాపు 20 మంది ఎన్నికల సిబ్బంది హీట్‌స్ట్రోక్‌కు గురయ్యారు. మే నెలలో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిన ఢిల్లీ.. బుధవారం 79 సంవత్సరాల గరిష్ట స్థాయి 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నేడు లోక్ సభ ఎన్నికల తుదిదశ ఎన్నికల పోలింగ్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్. 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్. నేడు గవర్నర్‌ను కలువనున్న సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్‌ను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించనున్న రేవంత్. నేడు పోస్టల్ బ్యాలెట్‌పై ఏపీ హైకోర్టులో విచారణ. సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టు తీర్పు. బెంగళూరులో నేడు సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ. నేటి నుంచి…
కర్ణాటకలో జూన్ 1 నుంచి 5 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర శాసన మండలి ఎన్నికల ఫలితాల కారణంగా జూన్ మొదటి వారంలో కనీసం ఐదు రోజుల పాటు కర్ణాటకలో మద్యం అమ్మకాలు నిషేధించారు. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలకు ఓటింగ్, జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో.. జూన్ 1 నుంచి 4 వరకు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. శాసన మండలి ఎన్నికల ఓట్ల…
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విపరీతమైన ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వేడిమి కారణంగా గ్యాస్ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. సింధ్‌లోని హైదరాబాద్ ప్రాంతంలోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ వేడి కారణంగా పేలిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు మరణించారని.. మంటల్లో గాయపడిన మరికొందరు…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు కీలక అధికారులను గొర్రెల స్కామ్‌లో అరెస్ట్ చేసింది.