నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంలో మితిమీరిన వేగంతో కార్ నడుపుతూ ఒకరి మరణానికి కారణమయ్యారు యువకులు. కూకట్ పల్లిలోని ఒక హాస్టల్ లో నాగర్ కర్నూల్ నలుగురు బ్యాచిలర్ యువకులు ఉంటున్నారు. ఒక యువకుడి పుట్టినరోజు సందర్భంగా… ఫుల్ గా మధ్యం సేవించి కాల్ సెంటర్ కు చెందిన Xylo కార్ లో చార్మినార్ కు వెళ్లి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో మితిమీరిన వేగంతో వాహనం నడిపిస్తూ… ఒక ఆటో ను బలంగా ఢీకొనడంతో ఆటో పల్టి కొట్టి ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
కానీ మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు కారును ఆపకుండా వేగంగా పారిపోతుండగా… అదే సమయంలో అటునుండి వెళ్తున్న నెరేడ్ మెట్ కు చెందిన అజయ్ అనే యువకుడు ఆ కారు ను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ వారు ఆ కారును ఆపకుండా ఆ యువకుడిని ఢీకొట్టి… అతనిపై నుండి వాహనాన్ని పోనిచ్చాడు. దీంతో కారు కింది పడి అజయ్ తీవ్ర రక్త స్రావంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మద్యం మత్తులో ఒకరి మృతికి ప్రత్యక్షంగా కారణమైన , ఆటో డ్రైవర్ ప్రాణాపాయ స్థితికి కారణమైన నలుగురు యువకుల్లో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం నాంపల్లి పోలీసులు గాలిస్తున్నారు.