ఏపీ రాజధానికి జాతీయ రహదారికి అనుసంధానం చేసే అంశపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌హైవేతో అనుసంధానం చేసేలా సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్ల నిర్మాణానికి సీఆర్డీయే ప్రణాళికలు రచిస్తోంది.
గుంటూరు కార్పొరేషన్లో సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. వెలగపూడి నుండి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి అవకాశం ఉంది. విభజన సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అమిత్‌షాను కోరనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. రాత్రికి సీఎం చంద్రబాబు…
కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్దరించాలని, బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి.. క్రిమినల్స్ తో కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.…
నెట్టింట వైరల్‌గా మారిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చెప్పుల ధర ఎంత ఉంటుంది. వందలల్లో ఉంటుంది. ఇక కాస్తా ధనవంతులైతే వేలల్లో పెట్టి కొంటారు. మరి బాత్రూంకు వాడే చెప్పులైతే వంద రూపాయలు లేదా ఇంకాస్తా ఎక్కువ పెట్టి కొంటారు. కానీ సౌదీ అరేబియాలోని ఒక దుకాణంలో వేలల్లో కాదు లక్షల్లో అమ్ముతున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు పై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. టెక్నీకల్ పాయింట్స్ పై నే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నదని, బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు మధుయాష్కీ. తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం అని ఆయన ప్రశ్నించారు. పది ఏండ్లలో 80 వేల కోట్ల అవినీతి చేశారని, గతంలోనే విద్యుత్…
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్‌ను ప్రభుత్వం నియమించింది. సార్వత్రిక ఎన్నికల ముందు జమ్మలమడుగు డీఎస్పీగా యశ్వంత్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు నిక్కచ్చిగా జరిపారని యశ్వంత్ పేరు పొందారు.
జమ్మూ డివిజన్లో జరిగిన దాడుల్లో.. జనవరి 1 నుండి ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడుల్లో ఆర్మీ కెప్టెన్‌తో సహా 12 మంది భద్రతా సిబ్బంది బలి అయ్యారు. ఈ దాడుల్లో 10 మంది పౌరులు మరణించగా, 55 మంది గాయపడ్డారు. ఈ సమయంలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాను కమిషన్ ఛైర్మన్‌గా వైదొలిగినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తనకు రాసిన లేఖలో కూడా సమాజం అంగీకరించే భాష వాడలేదని అన్నారు. విచారణ కమిషన్లు వేసేదే.. ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను గతంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై వేసిన కమిషన్‌కు కూడా పనిచేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు.
తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద 31 అంశాలు పెండింగులో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో అనేక శాఖలకు సంబంధించినవి ఉన్నాయని, రెసిడెంట్ కమిషనర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నానని ఆయన తెలిపారు. పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు కేంద్రాన్ని కలిసి మాట్లాడారని, మేం కూడా మా వంతుగా ఈ పెండింగ్ అంశాలపై కేంద్రంతో చర్చిస్తామన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. పెండింగ్ అంశాలపై రాష్ట్రానికి చెందిన అన్ని…