ఈ రోజు హైదరాబాద్‌లో సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి) విస్తరణలో తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సనోఫీ రాబోయే 6 సంవత్సరాలలో € 400 MN పెట్టుబడులకు కట్టుబడి ఉంది, వచ్చే ఏడాదికి € 100 MN కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. GCC రాబోయే 2 సంవత్సరాలలో 2600 మందికి ఉపాధి కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు…
నరసాపురం ఎంపీడీవో అదృశ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంపీడీవో అదృశ్యం విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంపీడీవో కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆయన ఆరా తీశారు. నరసాపురం ఫెర్రి బకాయిలు అందించాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు.
మహిళా శక్తి పథకం కింద త్వరలో మహిళా స్వయం సహాయక సంఘాలు మీ సేవా కేంద్రాలను నిర్వహించనున్నారు. కేంద్రాలను కేటాయించడంతో పాటు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఫర్నిచర్ , ఇతర పరికరాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి కింద రూ.2.50 లక్షల రుణాన్ని మంజూరు చేస్తుంది . కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఎస్‌హెచ్‌జిలకు నెలవారీ వాయిదాలలో రుణ మొత్తాన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇంటర్మీడియట్ , డిగ్రీ చదివిన గ్రూప్ సభ్యులను…
రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తు నివారణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన…
ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని ఆయన కొనియాడారు.
“జేఎన్టీయూ యూనివర్సిటీ హాస్టల్ లోనీ మంజీర బాలుర వసతిగృహము లో ఆదివారము రాత్రి పిల్లి వచ్చి ఆహారం తింటున్నది” అన్న సంఘటన పై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నరసింహ రెడ్డి , హాస్టల్ వార్డెన్ డా యన్ దర్గాకుమార్ , హాస్టల్ కేర్ టేకర్ పలువురు అధికారులు విచారణ చెప్పట్టి జరిగిన సంఘటన పట్ల వివరణ ఇచ్చారు. నిజానికి హాస్టల్లో ఓ కిటికీ తెరిచిన కారణంగా లోపలికి పిల్లి వచ్చే అవకాశము ఉండవచ్చును కాని అదికూడా…
ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి చెందాడు. కె.లూధియారావు అనే మార్షల్‌కు ఉదయం విధుల్లో ఉండగా గుండెపోటు రాగా.. వెంటనే తోటి సిబ్బంది మంగళగిరి ఎన్నారై హాస్పటల్‌కు తరలించారు.
గుంటూరులో 2022న జరిగిన ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం, ఆ తర్వాత అనుమానాస్పద మృతి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో నల్లపాడు పోలీసుల తీరుపై, ఓ పక్కన బాధితులు మరో పక్కన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.