Mallu Bhatti Vikramarka: ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించనున్నారు. ఈ నేథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రజా భవన్ లో బ్యాంకర్స్ తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం జరగునుంది. రుణమాఫీ గురించి బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్న ఉప ముఖ్యమంత్రి. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Read also: TG DSC Exams: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి..
ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని నిన్న ప్రజాభవన్ లో భట్టి తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వమన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ నాయకులారా రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. తల ఎత్తుకొని … ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండని, మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని 25000 చొప్పున.. నాలుగు ద పాలుగా పూర్తి చేశారన్నారు భట్టి విక్రమార్క.
CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం.. నేడు శాంతిభద్రతలపై